విశాఖపట్నం లో 2022 నవంబరు 23,24,25 తేదీలలోజరిగిన రాష్ట్రస్థాయి తపాలాబిళ్ళల పోటీ ప్రదర్శన APPEX - 22 (13th Andhra Pradesh State level Philately exhibition) ద్విగ్విజయంగా ముగిసింది. నవ్యఆంధ్ర లో తొలిసారి జరిగిన ఈ తపాలా ప్రదర్శనలో మన ఆంధ్రప్రదేశ్ లోని 109 మంది తపాలా బిళ్ళల సేకరణ దారులు షుమారు 320 ఫ్రెములలో 5200 పైగా షీట్స్ లో వేలాది తపాలాబిళ్ళలను ప్రదర్శించారు.
దీనిలో పాల్గొని నేను (కొడాలి శ్రీనివాస్) ఐదు ఫ్రెములలో 80 షీట్స్ తో ప్రదర్శించిన " Indian's Struggle for Freedom" కు సిల్వర్ బ్రాంజి మెడల్ వచ్చింది.
ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన తరువాత జరిగిన రాష్ట్ర స్థాయి తపాలబిళ్ళల ప్రదర్శన Appex 22. అన్ని రాష్ట్ర లలో ఇలా పోటీలు జరుగుతాయి. వీటిలో ఉత్తమ పతకాలు వచ్చిన ఫిలాటలిస్టులతో (2023, ఫిబ్రవరి 11 నుండి 15) దేశ స్థాయిలో అమృత ఫెక్స Amurtpex - 23 ఢిల్లీ లో జరుగుతుంది.
జ్ఞానాభిలాష కు తపాలబిళ్ళల సేకరణ ఒక మార్గం. ఇది మంచి అభిరుచి. ఈనాటి తరానికి దీని గురించి తెలియదు. నేటి విద్యార్థులకు,యువతకు దీన్ని పరిచయం చేస్తే వారు జ్ఞానాభివృద్దితో పాటు చేడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉంటారు.
Comments