Skip to main content

Posts

జలియన్ వాలాబాగ్ మారణహోమం

వంద ఏళ్ల క్రితం 13-04-1919 లో జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణహోమం తలుచుకుంటూ, ఆనాటి అమర వీరులకు నివాళి గా మన తపాలా శాఖ 13-04-2019 న రెండు తపాలా బిళ్లలను ఒక మినియేచర్ను విడుదల చేసింది 

GUNTUR PEX - 2019

                     మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన ' GUNTUR PEX - 2019 , గుంటూరులో ఫిబ్రవరి 2019,  19,20,తేదీలలో తపాలా శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సందర్భంగా మహాత్మాగాంధిజీ పై రెండు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేశారు  ఈ ప్రదర్శనలో గాంధీజీ పై వచ్చిన తపాలా బిళ్లలతో గాంధీజీ జీవితాన్ని ,ఆయన ఆశయాలను చాలా అద్భుతంగా తెలియజెప్పే ప్రయత్నం అనేకమంది తపాలా సేకరణ కర్తలు విజయవంతంగా చేశారు.         ఈ ప్రదర్శన సందర్భంగా తపాలా శాఖ గాంధీజీ పై రెండు ప్రత్యేక కవర్లు విడుదల చేసింది. పాఠశాల విద్యార్థులకు క్విజ్, వకృత్వ, వ్యాసాల యందు పోటీలు జరిగాయి. ముగింపు లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ ప్రదర్శనలో ఎంతో శ్రమకోర్చి తపాలా బిళ్ళలు ప్రదర్శించిన సేకరణ కర్తలందరికి ఙ్ఘాపికలు ఇచ్చారు.  ఈ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ఒక ఫిలాటలిస్ట్ గా నేను "స్ట్రుగుల్ ఫర్ ఫ్రీడమ్" పేరుతో మూడు ఫ్రేమ్ ల తపాలా బిళ్లలను ప్రదర్సించాను.  ...

Geographical Indication Registered Handicraft Products

భౌగోళిక గుర్తింపు పొందిన(GI) మన దేశపు హస్తకళా వస్తువుల పై మన తపాలా శాఖ వారు 5 తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ని 31-12-2018 న విడుదల చేసారు. జయపూర్ నీలం రంగు కూజాలు , పాలక్కాడ్ మద్దెల , కర్నటక కాంశ్య విగ్రహాలు, కుచ్ ఎంబ్రాడర్ వస్త్రాలు , బీహార్ లోని సిక్కి లో గడ్డితో తయారైన వస్తువులు వీటిపై చోటు చేసుకున్నాయి. 
75th Anniversary of the  First Flag Hoisting at Port Blair నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా INA   ద్వారా మొదటిసారి మన జాతీయ పతాకం పోర్ట్ బ్లెయిర్ లో ఆవరిష్కరించిన సంఘటన జరిగి 75 ఏళ్ళు అయిన మన తపాలా శాఖ 30-12-2018 న మూడు తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  

UNESCO World Heritage Sites in India -1 రాజస్థాన్ లో కోటలు

యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు  UNESCO World Heritage Sites in India- 1, పేరుతో   29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  దీనిపై  ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లో గల ఆరు చారిత్రాత్మక కోటలు - 1. కుంభాల్ ఘర్, 2. చిత్తోర్ ఘర్, 3. జైసల్మేర్ , 4. గగ్రోన్, 5.రతంబోర్, 6. అజ్మీర్ హిల్ ఫోర్ట్  లు చోటుచేసుకున్నాయి. 

National Police Memorial

మన స్వాతంత్రం వచ్చిన 1947 నుండి నేటివరకు దేశ పౌరుల రక్షణలో ప్రాణాలు అర్పించిన 34484 మంది పోలీసుల స్మృతి చిహ్నం గా 21- 10 2018 న ఢిల్లీ లో నిర్మించిన జాతీయ పొలిసు మెమోరియల్ కు గుర్తుగా మన తపాలా శాఖ 22-12- 2018 న రెండు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.   

తపాలా కవరు పై పద్మ విభూషణ్ డా. అక్కినేని

తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారి 95వ జన్మదినం సందర్భంగా మన తపాలా విభాగం ఒక ప్రత్యేక తపాలా కవరును 19-09-2018 న హైదరాబాద్ లో విడుదల చేసింది. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.  SPECIAL COVER ON Dr. A.N.R.