Skip to main content

Posts

అంతర్జాతీయ యోగాదినం -జూన్‌ 21( INTERNATIONAL DAY OF YOGA)

India post issued a set of 12 stamps and miniature sheet on International Day of Yoga on 20 June 2016. ఐక్య రాజ్యసమితి చే జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించబడిన సందర్బాన్ని పురస్కరించుకొని యోగాలో భాగంగా ఉన్న సూర్య నమస్కారాలను సూచిస్తూ భారత తపాల శాఖ 12 తపాల బిళ్ళలు  మరియు ఒక మినిఎచార్ ను 20-06-2016న విడుదల చేసింది. ఇంతకు ముందు కుడా యోగ పై తపాల బిళ్ళలు విడుదల చేసారు .   ఐక్య రాజ్యసమితి చే జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించబడిన సందర్బాన్ని పురస్కరించుకొని భారత తపాల శాఖ ఒక తపాల బిళ్ళ మరియు ఒక మినిఎచార్ ను 21-06-2015 న విడుదల చేసింది.  INTERNATIONAL DAY OF YOGA India post issued a stamp and miniature sheet on International Day of Yoga on 21 June 2015. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేటి సమాజానికి భౌతికంగా వ్యాయామ అవసరాన్ని యోగా తెలిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.  భారతీయ సంస్కృతి లో భాగమైన యోగా నేడు విశ్వవ్యాప్తం చెంది అందరి మన్ననలు పొందుతున్నది.  యోగ శాస్త్రం రూపకర్త అయి...

మహానేత నందమూరి తారక రామారావు

తెలుగు వారికి ఒక విశిష్టత, గుర్తింపు కల్పించిన మహా నటుడు, మహానేత మన NTR .  NTR  గౌరవార్దం 28-05- 2000 న మన తపాల శాఖా వారు మూడు రూపాయల విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.  ఈ తపాలా బిళ్ళ రూపకల్పన పరమాద్బుతం.  ఈ తపాల బిళ్ళ పై నందమూరి తారాక రామారావు గారి చిత్రం తో పాటు వారి కీర్తి శిఖరం కు చిహ్నం గా హిమాలయ పర్వతాలు, చలన చిత్ర రంగానికి ప్రతినిధిగా సినిమా రీలు, దానిలో వారి ప్రజా/ కళా సేవకు గుర్తుగా భూమి,సూర్యుడు ఉన్నాయి.  N.T.RAMA RAO India Post released one  Commemorative postage stamp  to   Dr. N.T.Ramarao   on  28-05-2000 BROCHURE- NTR తపాలాబిళ్ళ తో  పాటు విడుదల చేసిన ప్రత్యక తపాలా కవరుపై ( FIRST DAY COVER ) ప్రజలతో ప్రసంగించుతున్న N.T.రామారావు గారి చిత్రం ముద్రించారు .  ఈ ప్రత్యేక కవర్ పై  ప్రత్యేక తపాలా ముద్ర గా ' శ్రీ కృష్ణ దేవరాయలు వేషం లో ఉన్న  రామారావు ' చిత్రం తో రూపొందించటం మరొక ప్రత్యేకతను సంతరించుకుంది.  FIRST DAY ...

జలో రక్షతి రక్షితః

MEGHADOOT POST CARDS ON  GROUND WATER PROTECTION నీరే ప్రాణకోటికి జీవాధారం. అలాంటి జలాన్ని సంరక్షిస్తేనే మనం సుభిక్షితంగా జీవిస్తాం. ఈ సందేశాన్ని అందరికి తెలియజేయటానికి మన తపాల శాఖ మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ పై సందేశాలను ముద్రించింది.  2004 లో నార చంద్రబాబు అద్వర్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ కొరకు నడుంకట్టి దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. ఇంకుడు గుంటల ఆవశ్యకతను తెలియజేసి అదొక మహా యజ్ఞం లా చేపట్టింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన  25 పైసల ఈ 'మేఘదూత్ పోస్ట్ కార్డ్స్' ఇచ్చే సందేశాలు గమనించండి.  అయిన మనలో స్పందన లేదు. దాని పలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అప్పటిలా ఈ యజ్ఞాన్ని అపహాస్యం చేయకుండా మనస్పూర్తిగా చేపడదాం.  రాష్ట్ర వ్యాప్తంగా భూగర్బ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపండి. స్వర్ణ ఆంధ్రకు జై కొట్టండి.   జలో రక్షతి రక్షితః నీరు లేక ప్రగతి లేదు - నీరు లేక జగతి లేదు  భూగర్బ జలం అముల్యమైనది -దానిని ఆదాచేయండి, కాపాడండి . Ground Water is Precious ... Save it and Protect it Ground Water is ...

భారత రత్న బి. ఆర్. అంబేద్కర్ తపాల బిళ్ళ

Commemorative Stamp on Dr. B. R. Ambedkar & Constitution of India - 30th September 2015. Dr.B.R. అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా మన తపాల శాఖ 30-9-2015 న మరొక  స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది.   Dr.B.R. అంబేద్కర్ మరియు భారత రాజ్యాంగం పేరుతో ఈ తపాలా బిళ్ళ విడుదలైంది .  భారత రాజ్యంగ నిర్మాతగా ,దళిత బడుగు వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించటానికి రిజర్వేషన్స్ , ప్రతేక హక్కులు కల్పించిన నేతగా , మేధావిగా , బౌద్ద మతాభిమానిగా, అబినవ మనువుగా  కొనయాడబడే వ్యక్తి భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ (1891-1956).  Dr.B.R. Ambedkar and Constitution of India  వీరి గౌరవార్దం మన తపాల శాఖ ఇప్పటివరకు వివిధ సందర్బాలలో ఇంతకు పూర్వం  ఆరు తపాల బిళ్ళలు విడుదల చేసింది. మహాత్మా గాంధీ, చాచా నెహ్రు ల తరువాత అత్యధిక తపాల బిళ్ళలు విడుదల చేసింది  అంబేద్కర్ పైనే  75వ జయంతి 14-4-1966 న విడుదల చేసిన తపాల బిళ్ళ  Dr. B.R. Ambedkar  - 75th Birth Anniversary Date of Issue - 14 -04-1966 83వ జయంతి 14-4-1973 న విడ...

మన తెలుగు వారి లో జాతీయ ప్రాముఖ్యం గల వారు ఎవరు లేరా?

India Post Issued new 11th series of  Definitive Stamps in the name of    Builders of Modern India మన తపాల శాఖ లో రోజు వారి వాడకం కొరకు  నవభారత నిర్మాతల వరసలో  15-10-2015 నుండి కొత్త  5 రూపాయల  తపాల బిళ్ళలు వాడకం లోకి వచ్చాయి.  భగత్ సింగ్ , స్వామి వివేకానంద, దీనదయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ. బాబు రాజేంద్ర ప్రసాద్ , మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రామ్ మనోహర్ లోహియా    లాల్ బహుదూర్ శాస్త్రి ల బొమ్మలతో వీటిని విడుదల చేసారు.   ఇదే వరసలో వచ్చిన తపాల బిళ్ళల లో 25 పైసల నెహ్రు తపాల బిళ్ళ స్థానం లో మహాత్మా గాంధీ , యోగ లను , 50 పైసల పై సుబ్రమణ్య భారతి ,రూపాయ తో తిలక్ , 50/- రూపాయల విలువతో రవీంద్రనాథ్ టాగోర్  విడుదుల చేసారు. ఈ వరసలో మొత్తం 27 రకాల తపాల బిళ్ళలు  విడుదల చేసారు.  దక్షిణాది రాష్ట్రాలలో కేవలం    తమిళ ప్రముఖులకుమాత్రమే దీనిలో స్థానం కల్పించారు. దక్షినాది నుండి ఎన్నిక చేసిన  నలుగురు ( సుభ్రమణ్య భారతి , సుబ్బులక్ష్మి, రామానుజం, తిరువల్లార్) తమిళులే....

గుంటూరు మిరపకాయలు, ఉండవల్లి గుహలు పైన ప్రత్యేక తపాల కవర్లు

INDIA'S STRUGGLE FOR FREEDOM- MY EXIBIT IN GUNTUR FEX-2016 ఈ తపాల బిళ్ళల ప్రదర్శనలో  INDIA'S STRUGGLE FOR FREEDOM అనే పేరుతో 3 X 16 = 48 sheets తో మన స్వతంత్ర సంగ్రామ చరిత్రను నేను గత 30 ఏళ్ల నుండి సేకరించిన తపాల బిళ్ళ లతో ప్రదర్శంచ బడినది.  ప్రదర్శన తిలకిస్తున్న విద్యార్దులు  భారత తపాల శాఖ 2016,పిబ్రవరి 8,9  తేదిలలో గుంటూరు లో GUNTURPEX -2016 పేరుతో నిర్వహించిన తపాల బిళ్ళలు  ప్రదర్శన లో రెండు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. కారం ఘాటు కు ప్రసిద్దిగాంచిన  గుంటూరు మిరపకాయలు పైన ఒకటి, అద్బుత శిల్ప కళకు ఆవాసం మైన ఉండవల్లి గుహలు పైన మరొకటి వచ్చాయి.  Special cover on Guntur Mirchi Special cover on Undavalli Caves

GUNTUR PEX-2016

భారత తపాల శాఖ 8 మరియు 9 -2-2016 తేదిలలో గుంటూరు లో GUNTURPEX -2016 పేరుతో  తపాల బిళ్ళలు  ప్రదర్శన పోటి జరుపుతున్నారు. గుంటూరు జిల్లావాసులు మాత్రమే ఈ పోటికి అర్హులు.  గుంటూరు  బృందావన్  గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో రెండు   రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో తపాలా బిళ్ళల సేకరణ దారులచే అరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు ప్రదర్శించ బడతాయి.   ప్రవేశం ఉచితం.