Skip to main content

Posts

ఏకలవ్య కు తపాల బిళ్ళ

India Post released a 5 rupees postal stamp   on EKLAVYA , a character in' Mahaa Bharatha' on 27 December 2013  Eklavya మన తపాల శాఖ 27-12-2013 న మహాభారతం లో ద్రోణాచార్యలకు గురు దక్షణ గా తన కుడి చేతి బోటని వేలును సమర్పించిన విలు విద్య  వీరుడు   ఏకలవ్య కు తపాల బిళ్ళ ను విడుదల చేసింది. First day cover - Eklavya ఏకలవ్యుడు   మహాభారతంలో  గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర.   నిషాధ తెగకు  చెందినవాడు.  ద్రోణాచార్యుని వద్ద   విలువిద్యను అభ్యసించాలని కోరికను తక్కువకులానికిచెందిన వాడైనందువల్ల ద్రోణుడు  తిరస్కరించడంతో, ఏకలవ్యుడు  బంకమట్టితో  ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా విలు విద్యా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒక నాడు అడివిలో ఏకలవ్యుడు విలువిద్యా నైపుణ్యం చూసిన ద్రోణుడు ఎక్కడ తన ప్రియ శిష్యుడు ఆర్జునుడిని  మించిప...

గుర్తింపు లేని నీలం సంజీవరెడ్డి శత జయంతి

భారతదేశపు ఆరోవ రాష్ట్రపతిగా 1977-1983 వరకు పనిచేసిన శ్రీ నీలం సంజీవ రెడ్డి(1913-1996) గారి శత జయంతి ని గుర్తించని కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో మన తెలుగు వారిని  మరో సారి కించపరిచింది. రాష్ట్రపతి గా ఏకగ్రీవంగా ఎన్నికై   రెండు సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసి  రెండు పర్యాయాలు లోకసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి  శ్రీ నీలం సంజీవరెడ్డి. వారి శత జయంతి ని మన రాజధాని ఢిల్లీ లో తలుచుకున్న నాధుడే లేడు.  మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది.  1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు. ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిర...

ఇండియా -జపాన్ మైత్రి బంధం ... కుతుబ్ మినార్ - టోక్యో టవర్

India Post released a 20 rupees Miniature stamp   on the Visit of Emperor Akihitho  and Empress Michiko  of Japan on 5th December 2013. The miniature sheet shows Qutub Minar and Tokyo Tower  Qutub Minar and Tokyo Tower జపాన్ దేశ రాజు రాణి మన దేశానికి వచ్చిన సందర్బం గా మన తపాలా శాఖ  5-12-2013 న ఒక మినిఎచర్ షీట్ ని విడుదల చేసింది.  ఇలా ప్రముఖులు దేశ సందర్శన కు వచ్చినపుప్పుడు వారి గౌరవార్దం వారి చిత్రాలతో  తపాలా బిళ్ళలు విడుదల చేయటం చాలా దేశాలలో ఉంది. కాని మన దేశం లో వ్యక్తుల ప్రీతి కొరకు ఇప్పటి వరకు తపాలా బిళ్ళలు విడుదల చేయలేదు. ఇదే తొలిసారి. జపాన్ రాజు రాణి చిత్రాలు కాకుండా ఇండియా -జపాన్ మైత్రి బంధం గా  దీనిపై కుతుబ్ మినార్ ,టోక్యో టవర్ చిత్రాలు ముద్రించారు.   

కంచరపార మరియు జమలపూర్ రైల్వే వర్క్ షాప్స్

India Post released a New Set of  Two Stamps and one Miniature sheet for  Railway Workshops - Kanchrapara and Jamalpur " on 26th November 2013. తూర్పు రైల్వే పరిధి లో ఉన్న కంచరపార మరియు జమలపూర్ లో ఉన్న రైల్వే వర్క్ షాప్స్ కు 150 ఏళ్ళు నిండిన సందర్బంగా 26 - 11 -2013 న మన తపాల శాఖ రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసింది.                                          Railway Workshops - Kanchrapara ,Jamalpur 

జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు- సచిన్ కొరకు సడలించిన నియమం

చాలా దేశాలు జీవించి ఉన్నప్రముఖు వ్యక్తులకు వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేస్తుంటాయి. ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత  మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు.  Dr. M. VISWESVARAYA(15-9-1960) నూరు ఏళ్ళు జీవించిన ప్రముఖ వ్యక్తులకు తపాలా బిళ్ళలు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వచ్చింది . ఈ కోవలో    1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన  మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే  ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో  (మరణం 1962లో)   ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన   వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం...

Children's Day - 2013

India Post released a stamp   on 14th November 2013  to celebrate Children's Day Children's Day - 2013 ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది   తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్ని  బాలల దినోత్సవం   14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు.  

సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం - తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం

India Post released two postal Stamps and one miniature sheet, one Sheet let  On 14th November 2013, to honor Sachin Tendulkar, on veiw of his 200th test match at Mumbai.  Sachin Tendulkar - miniature sheet మన తపాలా శాఖ వారు అభిమాన క్రికెట్ క్రీడాకారుడు   సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం తో సత్కరించారు . మన దేశం లో జీవించి ఉన్న ఎ క్రీడా కారునికి దక్కని గౌరవం ఒక్క సచిన్ కె దక్కింది.  200 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ  క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న సందర్బం గా 14-11-2013 న సచిన్ టెండూల్కర్ పై రెండు తపాలా బిళ్ళలు (Rs 20/-), ఒక మినిఎచర్, ఒక షీట్ లెట్ ను విడుదల చేసారు. మన తపాలా శాఖ సాదారణంగా జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళ విడుదల చేయదు. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి సచిన్ కు తపాలా బిళ్ళలు విడుదల చేసి తమకు క్రికెట్ పిచ్చి ఉందని ప్రపంచానికి చాటుకుంది.  Sachin Tendulkar -  sheet let