అందంగా ఉన్న చిన్న పేపరు ముక్క ఎన్నో సంగతులు చెబుతుంది. సమాజానికి కావలిసిన జ్ఞానం అనేక విధాలగా అందించుతుంది.చరిత్ర కు ఒక గుర్తుగా నిలుస్తుంది.విశ్వవ్యాప్తంగా సోదర భావాన్ని పెంచుతుంది. అదే తపాల బిళ్ళ అయినా కావచ్చు లేకపోతే కరెన్సి ముక్క అయిన కావచ్చు. రాబోయే యువతరాన్ని సరైన మార్గంలో పెట్టె మంచి అలవాట్లల లో తపాల బిళ్ళల/నాణేల సేకరణ కుడా ఒకటి. మనస్సుకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే హాబి లలో అతి ముఖ్యమైనది తపాల బిళ్ళ ల సేకరణ. బాల్యం లోనే దీనిని పరిచయం చేస్తే విద్యార్దులు చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు. సెల్ ఫోనులు వచ్చాక ఉత్తరాలు రాయటం పోయింది. నేటి తరానికి తపాల బిళ్ళ ల గురించి తెలుసుకొనే తీరిక కోరిక సన్నగిల్లింది. ఈ తరుణం లో ఒక ప్రయోజన కరమైన హాబిని యువతలో విద్యార్దులలో పెంపొందిచటానికి తపాలా బిళ్లల మరియు నాణేల గురించి తెలిపే ప్రదర్శనలు విరిగా పెట్టాలి. ఈ ఆశయం తోనే గుంటూరు బాలాజీ కళ్యాణ మంటపం, బృందావన గార్డెన్స్ లో Guntur Numismatic and Philatelic Society( GNPS ), Guntur వారి ఆద్వర్యంలో 2012 అక్టోబర్ 13,14 తేదిలలో తపాల మరి...