అక్కినేని నాగేశ్వరరావు అమెరికా లో అక్కినేని నాగేశ్వరరావు గారి అబిమానులు(AFA) వారికి నివాళిగా20-9-2014 న ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను usps చే విడుదల చేపించారు . దీనికి ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండదు . ఇలాంటి వాటిని USPS కు డబ్బు చెల్లించి ఎవరిదైన వ్యక్తిగత చిత్రాన్ని తపాల బిళ్ళ పై ముద్రించు కోవచ్చు. ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు. మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్ పధకం లో ఇలాంటి వ్యక్తి గత తపాల బిళ్ళలు పొందవచ్చు . AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా? దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది. మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి, అల్లు రామలింగయ్య గార్లకు, చలనచిత్ర దర్శకులలో దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొ...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.