Skip to main content

Posts

Showing posts from August, 2014

గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన

GUTUR STAMPS & COINS FEST-2014 GNPS -   ( Guntur Numismatic and Philatelic Society)  20 వ వార్షికోత్సవం సందర్బం గా    2014 సెప్టెంబర్ 5,6,7తేదిలలో గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన జరుపుతున్నారు. గుంటూరు  బృందావన్  గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో   మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి.   ప్రవేశం ఉచితం. ఈ సందర్బంగా తెలుగు సంస్కృతి ని ప్రతిబింబించే లా ప్రత్యేక తపాల కవర్లు , ప్రత్యేక సంచిక విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు. తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు  స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్  స్టాల్ లు ఏర్పాటు చేస్తునట్లు GNPS  కార్యదర్శి శ్రీ MVS ప్రసాద్ తెలియ జేస్తున్నారు.  GNPS -15 వ వార్షిక ప్రదర్శన సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవర్ 

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం

TANGUTURI PRAKASAM టంగుటూరి ప్రకాశం పంతులు ( 1872 - 1957 ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. 1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పదకొండు నెలలు పనిచేసారు . ఆ తరువాత 1953 లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్య మంత్రి గా దాదాపు 14 నెలలు పనిచేసారు . నిస్వార్ధ ప్రజా సేవకుడు . ప్రకాశం పంతులు తో పాటు వేమన ,వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ ల ప్రధమ దిన కవర్    ప్రకాశం పంతులు గారి గౌరవార్ధం అక్టోబర్ 16 , 1972 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు .ఈతపాల బిళ్ళ పై తెలుగులో ( టం.ప్రకాశం) అని ప్రకాశంగారి సంతకం ఉంది.తపాల బిళ్ళ పై తొలితెలుగు అక్షరాలు ఇవే. అదే సమయం లో  ప్రకాశం

ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల

Andhra Pradesh Postal Circle released a Special Cover to mark 81st birth anniversary of Professor Kothapalli Jayashankar on 6th August 2014 at Hyderabad.  6-08-2014 న మన తపాలా శాఖ తెలంగాణా ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల  చేసింది. ఆచార్య N. G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును మార్చి జయశంకర్ గారి పేరు పెట్టి ఆ సందర్బంలో ఈ తపాల కవరు విడుదల చేసారు. బతికి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిన వీరు మరణించినా తెలుగు జాతి మధ్య విద్వేషాన్ని రగాల్చటానికి ఉపయోగ పడటం శోచనీయం. ప్రపంచ కర్షకులారా ఏకం కండి అని నినదించి రైతు కూలి శ్రేయోరాజ్యం కొరకు జీవితాంతం పోరాడిన రైతు నాయకుడు ,గాన్దేయవాది శ్రీ NG  రంగా పేరును తీసి జయశంకర్ పేరు పెట్టేకన్నా ఒక కొత్త విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టటం సరైన నివాళి.  

తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు  2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన    తపాలా బిళ్ళల  ప్రద్రర్శన (APPEX -2014) లో  మన తెలుగు వారి విశిష్టతను  చాటేలా  'తెలుగు వెలుగులు '  పేరుతో తెనాలి కి చెందిన   శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ  సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు  అత్య  అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక  ప్రదర్శన కుడా ఇదే.  ఈ ప్ర దర్శన కు  సాయి కృష్ణ కు  వెండి -రజిత  (SILVER- BRONGE )  పతకం   బహుమతిగా వచ్చింది.   కేసినేని నాని నుండి  తెలుగు వెలుగులు కి బహుమతి ని స్వీకరిస్తున్న వి. సాయి కృష్ణ    తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ తపాలా బిళ్ళ పై  తెలుగు వెలుగులు  ప్రదర్శన లో కొంత భాగాన్ని మీరు  ఇక్కడ   చూడగలరు.