Skip to main content

Posts

Showing posts from November, 2013

కంచరపార మరియు జమలపూర్ రైల్వే వర్క్ షాప్స్

India Post released a New Set of  Two Stamps and one Miniature sheet for  Railway Workshops - Kanchrapara and Jamalpur " on 26th November 2013. తూర్పు రైల్వే పరిధి లో ఉన్న కంచరపార మరియు జమలపూర్ లో ఉన్న రైల్వే వర్క్ షాప్స్ కు 150 ఏళ్ళు నిండిన సందర్బంగా 26 - 11 -2013 న మన తపాల శాఖ రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసింది.                                          Railway Workshops - Kanchrapara ,Jamalpur 

జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు- సచిన్ కొరకు సడలించిన నియమం

చాలా దేశాలు జీవించి ఉన్నప్రముఖు వ్యక్తులకు వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేస్తుంటాయి. ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత  మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు.  Dr. M. VISWESVARAYA(15-9-1960) నూరు ఏళ్ళు జీవించిన ప్రముఖ వ్యక్తులకు తపాలా బిళ్ళలు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వచ్చింది . ఈ కోవలో    1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన  మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే  ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో  (మరణం 1962లో)   ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన   వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం...

Children's Day - 2013

India Post released a stamp   on 14th November 2013  to celebrate Children's Day Children's Day - 2013 ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది   తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్ని  బాలల దినోత్సవం   14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు.  

సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం - తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం

India Post released two postal Stamps and one miniature sheet, one Sheet let  On 14th November 2013, to honor Sachin Tendulkar, on veiw of his 200th test match at Mumbai.  Sachin Tendulkar - miniature sheet మన తపాలా శాఖ వారు అభిమాన క్రికెట్ క్రీడాకారుడు   సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం తో సత్కరించారు . మన దేశం లో జీవించి ఉన్న ఎ క్రీడా కారునికి దక్కని గౌరవం ఒక్క సచిన్ కె దక్కింది.  200 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ  క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న సందర్బం గా 14-11-2013 న సచిన్ టెండూల్కర్ పై రెండు తపాలా బిళ్ళలు (Rs 20/-), ఒక మినిఎచర్, ఒక షీట్ లెట్ ను విడుదల చేసారు. మన తపాలా శాఖ సాదారణంగా జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళ విడుదల చేయదు. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి సచిన్ కు తపాలా బిళ్ళలు విడుదల చేసి తమకు క్రికెట్ పిచ్చి ఉందని ప్రపంచానికి చాటుకుంది.  Sachin Tendulkar -  sheet let

భారతీయ విద్య భవన్

India Post released a stamp on 7th November 2013 to commemorate 75 years of Bharatiya Vidya Bhavan, which was set up by Dr. K.M Munshi in 1938 Bharatiya Vidya Bhavan and Dr. K.M.Munshi భారతీయ విద్య భవన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన భారత తపాలా శాఖ 7- 11- 2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళను విడుదల చేసింది.దీనిని 1938 లో గాంధీజీ సహకారం తో స్వాతంత్ర సమర యోదుడు శ్రీ కే యం  మున్షీ  గారు స్థాపించారు . " Let noble thoughts come to us from every side"   అనే ఋగ్వేద సూక్తం తో ఇది మన దేశం లో విద్య సేవ చేస్తుంది.  Dr. K.M.Munshi - Stamp Issued in 1988 నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్ పేరుతో 100 పైగా విద్యాలయాలు నడపబడుచున్నాయి. మన రాష్ట్రం లో కుడా 14 చోట్ల భారతీయ విద్య భవన్ వారి విద్యాలయాలు ఉన్నాయి . వాటి వివరాలు - Bharatiya Vidya Bhavan's International Residential Public School - Vidyashram - Bhimavaram Bhavan's Vidyashram - Guntur Bhavan's Atmakuri Rama Rao School - Hyderabad Bhavan's Vidy...

భాక్ర డ్యాం - దేశ సేవలో 50 వసంతాలు

India Post released a stamp depicting the Bhakra Dam on 22nd October 2013 to celebrate 50 years of its glorious service of the Nation Golden Jubilee of Bhakra Dam భాక్ర డ్యాం సట్లేజ్ నది పై హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో నిర్మించ బడినది.  ఆధునిక దేవాలయం గా నెహ్రు గారిచే కీర్తించబడిన భాక్ర డ్యాం  225.25 మీ ఎత్తు తో మన దేశం లోఎత్తేయిన ఆనకట్టలలో  రెండోవ స్థానం లో ఉంది. దీనికి దిగువన మరో ఆనకట్ట నంగల్ లో ఉంది. ఈ రెంటిని కలపి భాక్రా నంగల్ ఆనకట్ట గా ప్రసిద్ది చెందినవి . 1955 లో మొదలు పెట్టి 1963 లో నిర్మాణం పూర్తి చేసుకొన్న ఈ బహుళార్దక ఆనకట్ట 50 ఏళ్లుగా మన దేశానికి ఉపయోగ పడుతున్నది.  ఈ  స్వర్ణోత్సవ వేళ మన తపాలా శాఖ 22-10-2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.  ఇంతకు ముందు కుడా ఈ డ్యాం పై రెండు తపాల బిళ్ళలు విడుదల చేసారు.  A Definitive stamp on Bhakra dam - 15-3-1967 Silver Jubilee of Bhakra dam - 15-12-1988