గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, కరీంనగర్, వరంగల్,ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములోసంగమిస్తుంది.ప్రతి పండెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రతి 12 వ పుష్కరం ను మహా పుష్కరం అని అంటారు . ఇది 144 ఏళ్లకు ఒక సారి వస్తుంది.
2015 జూలై 14 నుండి గోదావరికి మహా పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్బంగా మన తపాల శాఖ తెలుగు మరియు హిందీ భాషలలో రెండు మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ను విడుదల చేసింది.
MEGHADOOT POST CARD ON GODAVARI PUSHKARAMS -2015 |
MEGHADOOT POST CARD ON GODAVARI PUSHKARAMS -2015 |
గోదావరి పుష్కరాలు-2003(30-07-2003 నుండి 10-08-2003 ) కు రాజమండ్రి కి యాత్రికులకు స్వాగతమ పలుకుతూ మన తపాల శాఖ ఆనాడు కుడా ఒక మేఘదూత్ పోస్ట్ కార్డు ను విడుదల చేశారు. 2003 పుష్కరాలు కుడా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అద్వర్యంలో నే జరిగాయి
MEGHADOOT POST CARD ON GODAVARI PUSHKARAMS -2003 |
Comments