ఉపాధ్యాయ వృత్తికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి.
మన తపాల శాఖ వారు వీరి గౌరవార్దం 1967 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను రాష్ట్రపతిగా వారు పదవీవిరమణ చేసిన సందర్బంగా విడుదల చేసారు. మరల వారి శత జయంతిన మరొక తపాల బిళ్ళను 1989 లో విడుదల చేసారు, ఈ రెండు తపాల బిళ్ళలను వారి జన్మ దినం అయిన సెప్టెంబర్ 5 న విడుదల చేసారు.

Date of Issue: 5 September 1967
Sarvepalli Radhakrishna - 75th Birth Anniversary
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి(1962-1967). అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. మద్రాసుకు 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.
- 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
- 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
- 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
- ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
Comments