Skip to main content

Posts

మన జాతీయ జండా పరిణామక్రమం

మన  జాతీయ జండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జయంతి సందర్బంగా 2ఆగష్టు 2022 న మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో నేను మన స్వతంత్ర పోరాటం గురించిన తపాళా బిళ్లలను ప్రదర్శించాను. ఈ సందర్బంగా వెంకయ్య గారిపై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. అలాగే కేంద్ర తపాల శాఖ మన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా   జాతీయ జండా పరిణామక్రమం పై 75/-రూపాయల ఒక మినియేచరును విడుదల చేసింది. Journey of the National Flag

STAMP ISSUE CALENDAR - 2021

భారత తపాలా శాఖ 2021లో విడుదల చేసిన తపాలా బిళ్ళలు   మొత్తం  తపాల బిళ్ళలు = 16 ముఖ విలువ = రూ 127 /- Sl.No Stamp Name Release Date 1 125th Birth Anniversary Year of Netaji Subhas Chandra Bose -  Rs.25/- 23-01-2021 2 50 Years of full Statehood of Himachal Pradesh - Rs.5/- 25-01-2021 3 The High Court of Gujarat- Rs.5/- 06-02-2021 4 100 Years of First Visit of Mahatma Gandhi to Odisha- Rs.5/- 23-03-2021 5 Golden Jubilee Year of India Bangladesh Friendship - Rs.5/- 27-03-2021 6 Rajyogini Dadi Janki  - Rs.5/- 12-04-2021 7 70 Years of Diplomatic Relations between India and Germany - Rs.25/- 10-06-2021 8 Golden Jubilee Year-Gayatri Teerth,Shantikunj - Rs.5/- 20-06-2021 9 Ma. Chaman Lal - Rs.5/- 07-08-2021 10 Rao Jaimal Rathore - Rs.5/- 17-09-2021 11 Martyrs of Solapur namely "Mallappa Dhanshetti, Shrikisan Sarada, Jagannath Shinde and Abdul Rasul - Rs.5/-   02-10-2021 12 Deccan College Bicentenary - Rs.5/- 06-10-2021 13 Dattopant Thengadi - Rs.5/- 10-11-2021 14...

Netaji 125th Birth Anniversary

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897) గారి 125వ జన్మదినం సందర్భంగా మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళను 23- 01 - 2021 న విడుదల చేసింది.  నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. మహాత్మాగాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిప్ఫీన్స్ దేశాలు కూడా ఆమోదించాయి. నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు  ప్రయాణిస్తుండగా విమాన ప్రమాద...

First Visit of Mahatma Gandhi to Odisha

India post released a Commemorative Postage Stamp on 100 Years of First Visit of Mahatma Gandhi to Odisha on 23rd March 2021. The First Day Cover of the Commemorative Postage Stamp portrays the Swaraj Ashram at Cuttack, where Mahatma Gandhi stayed during his first visit to Odisha on 23rd March 1921.

Salute to COVID-19 Warriors

Indian post was issued a set of four stamps and a miniature sheet on Salute to COVID-19 Warriors on 24th December 2020

I.K. Gujral - Prime Minister of India

India Post issued a Commemorative Postage Stamp of  denomination Rs 5/- on '  I.K. Gujral ' on 04.12.2020.    I.K. Gujral Indra Kumar Gujral  (4 December 1919 – 30 November 2012) was an Indian politician and freedom activist who served as the  12th Prime Minister of India  from April 1997 to March 1998.

ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా

మన తపాలా శాఖ 19-12-2019 న ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా పేరుతో 12 తపాలా బిళ్ళలు, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిలో 10 రూపాయల తపాలా బిళ్ళలు ఐదు , 15 రూపాయల తపాలా బిళ్ళలు మూడు, 20 రూపాయల తపాలా బిళ్ళలు నాలుగు ఉన్నాయి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్న ఎంబ్రాయిడరీస్ రూపురేఖలు తీసుకొని వాటితో ఈ తపాల బిళ్లలను రూపొందించారు. వీటిలో మన ఆంధ్రాలో 500 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ముద్ద అల్లిక (కమల్ కథై )కు స్థానం కల్పించారు. చేతిగుడ్డ, దిండు గలీబు, ద్వారాలకు తెర గుడ్డలు, వస్త్రాలకు వివిధ రకాల చిత్రాలు, పూలు, ఆకులు, జంతువులు పక్షులు వంటివి సూదితో రంగుల దారాలతో ఉబ్బెత్తుగా (3D) చాలా అందంగా అల్లటం దీని ప్రతేకత.  Embroideries of India ఆంధ్రా అల్లిక (కమల్ కథై ) అద్దాల  కుట్టు పని (అప్లిక్యూ) మన ఆంధ్ర, తెలంగాణా లలో నివసించే లంబాడి (బంజారా తెగ) స్త్రీలు వాడే దుస్తులకు అద్దాలు అమరిచ్చి అందంగా తయారు చేసే కుట్టు పని (అప్లిక్యూ) కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు.