Skip to main content

Posts

తపాల బిళ్ళ పై సామ్రాట్ అశోకుడు

India Post released a commemorative stamp on Samrat Ashok on 24 August 2015 మన తపాల శాఖ 24-08-2015 న  సామ్రాట్ అశోకుడు పై ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  అశోకుడు క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. మన జాతీయ చిహ్నం సారానాద్ లోని అశోక స్తంబం నుండి స్వీకరించబదినది. అలాగే మన జాతీయ జండాలో అశోకుని ధర్మచక్రం ఉంచబడినది.   

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా ప్రత్యేక తపాల కవర్లు

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా   మన తపాల శాఖ  13-07 2015 న రాజమండ్రి లో గోదావరి నదిపై ఉన్న ప్రసిద్ది చెందిన హవేలోక్ ఆర్చ్ వంతెన పై ఒకటి , గోదావరి సాగర సంగమ ప్రాంతం అయిన అంతర్వేది పై ఒకటి , 15-07-2015 న  రాజమండ్రి కోటిలింగాలు వద్ద ఉన్న అతి పొడవైన స్తానవాటిక పై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.   అలాగే తెలంగాణ లో 14-07-2015 న గోదావరి నది తెలుగు నేల పై అడుగు పెట్టిన ప్రదేశం ' కందకుర్తి ' పై ఒకటి ( ఈ గ్రామం గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణీ సంగమ స్థలంలో ఉన్న తీర్థక్షేత్రం) ,కాళేశ్వర స్వామి దేవాలయం పై ఒకటి , పోచంపాడు లో గోదావరిపై కట్టిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ పై మరొకటి  రెండు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. On the occasion of Godavari Puskaralu 2015 Four special covers were released on 13th, 14th,15th July 2015.  With respect to Telangana state One special cover was released on  Kandakurthi-Triveni Sangamam and second was on  Sriram Sagar Irrigation Project, Pochampadu . With respect to Andhra Pradesh one special cov...

రణరంగ చౌక్ - తెనాలి

A Special cover Issued by Indian Post on 1-11-2007 in APPEX -2007, held at  Vishakhapatnam. This Special cover depicts -  Ranarang chouk -Tenali ,Guntur dist. విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ( APPEX -2007 ) 1-11-2007న  ఒక  ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసారు.  దానిపై   తెనాలి లో ఉన్న స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు. దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మహాత్మా గాంధీ బొమ్మను ఉపయోగించారు Special cover on  Ranarang chouk -Tenali మన దేశ స్వతంత్ర పోరాటం లో భాగం గా 1942 లో ఆగష్టు 9న జరిగిన ముంబాయి  కాంగ్రెస్ సమావేశంలో  సంపూర్ణ స్వరాజ్యాఉద్యమానికి నాంది పలుకుతూ   " క్విట్ ఇండియా " తీర్మానాన్ని ఆమోదించారు.  ఈ సభకు గుంటూరు జిల్లా నుండి   ప్రముఖ స్వతంత్రయోధుడు గాన్దేయవాది  శ్రీ కల్లూరి చంద్రమౌళి  గారి నాయకత్వంలో వెలవొలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు,అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి చౌదరి పాల్గొని వ...

గోదావరి పుష్కరాల పై తపాల బిళ్ళ

మన తపాల శాఖ 'మై స్టాంప్ ' పధకం లో భాగంగా గోదావరి పుష్కరాలపై 14-7-2015 న ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను విడుదల చేసింది. అన్ని ప్రధాన తపాల శాఖలలో వీటిని పొందవచ్చు. On the festive occasion of Godavari Pushkaram, India Post released fifth series of ‘My Stamp’ on Godavari Pushkaram 2015 theme on 14th July 2015.  The template is having image of Godavari River and sheet of 12 stamps depicts the Godavari Arch Bridge, a bowstring-girder bridge that spans the Godavari River in Rajahmundry and photo of Godavari Maha Aarti at Rajahmundry, Andhra Pradesh. గోదావరి పుష్కరాల పై తపాల బిళ్ళ

గోదావరి పుష్కరాలు - మేఘదూత్ పోస్ట్ కార్డ్స్

గోదావరి నది  భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, కరీంనగర్, వరంగల్,ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములోసంగమిస్తుంది.ప్రతి పండెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రతి 12 వ పుష్కరం ను మహా పుష్కరం అని అంటారు . ఇది 144 ఏళ్లకు ఒక సారి వస్తుంది.  2015 జూలై 14 నుండి గోదావరికి మహా పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్బంగా మన తపాల శాఖ తెలుగు మరియు హిందీ భాషలలో రెండు మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ను విడుదల చేసింది.  MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015   MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015   గోదావరి పుష్కరాలు-2003(30-07-2003 నుండి 10-08-2003 ) కు రాజమండ్రి కి  యాత్రికులకు స్వాగతమ పల...

కాకినాడ EGNPEX – 2015 లో ఐదు ప్రత్యేక తపాల కవర్లు విడుదల

India Post released Five special Covers on the occasion of  philatelic exhibition  'EGNPEX-2015' held  on 15th – 17th May 2015 at Kakinada, Andhra pradesh. తూర్పు గోదావరి నాణేలు, తపాల బిల్లల సేకరణ సంఘం వారిచే కాకినాడ లో  2015 మే 15,16,17 తేదిలలో  జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన  ‘EGNPEX – 2015’ లో ఐదు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు.  మొదటి రోజు 15-5-2015 న అభినవ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ కు ఒకటి , అపర భగీరధుడు సర్ ఆర్దర్ కాటన్ కు ఒకటి బోజ్జనకొండ, లింగలమెట్టు లో బౌద్ద ఆరామలపై  ఒకటి మొత్తం మూడు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు.   రెండవ రోజు 16-5-2015 న కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం పై ఒకటి , నాదయోగి సంగీత కళానిధి నేదురమల్లి కృష్ణ మూర్తి పై మరొకటి  వెరిసి రెండు రోజులలో ఐదు  ప్రత్యేక తపాల   కవర్లు   విడుదల చేసారు.  Special cover on Smt. Dokka Seethamma (Annapurna) ( AP/8/2015).   Special cover on  Sir Arthur Thomas Cotto...

జిడ్డు కృష్ణ మూర్తి

India Post Issued a Commemorative  postage stamp on  Jiddu Krishnamurti on    11-05-1987  Jiddu Krishnamurti  ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) మదనపల్లి లో జన్మించారు.కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ " ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్దాపించి కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. మొదట తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. జగద్గురువుగా అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి వాటికి విలువ ఇవ్వక తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తన విశ్వాసానికి విరుద్దంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా వుండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచ లేదు. చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " ను రద్దుపరచాడు. తాను జిడ్డు ...