GNPS - (Guntur Numismatic and Philatelic Society) 25 వ వార్షికోత్సవం సందర్బం గా 2019 డిసెంబర్ 14, 15 తేదిలలో గుంటూరులో 'అమరావతి స్టాంప్ మరియు కాయిన్ ఫెస్టివల్ పేరుతో తపాల బిళ్ళలు ,నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో 2 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలోఅరుదైన వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడ్డాయి. మహాత్మా గాంధీ 150 వ జయంతి సంవత్సర సందర్భంగా పొందూరు ఖద్దర్ తో ఉన్న ఒక ప్రత్యేక తపాల కవర్ ను విడుదల చేసారు. గుంటూరులో ప్రముఖ ప్రజా వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు. GNPS రజతోత్సవ ప్రత్యేక సంచిక ను విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు జరిపి బహుమతులు ఇచ్చారు. పొందూరు ఖద్దర్ తో ఉన్న ఒక ప్రత్యేక తపాల కవర్ ప్రముఖ వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు ప్రత్యేక తపాల కవర్
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.