Skip to main content

Posts

Showing posts from November, 2018

ప్రపంచ పురుషుల హాకీ పోటీలు

ప్రపంచ పురుషుల హాకీ పోటీలు ఒరిస్సా లో జరిగిన సందర్భంగా మన  తపాలా శాఖ వారు 28-11-2018 న 5 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది. ఈ మినియేచర్ మనదేశంలో విడుదలైన మొదటి ఆడ్ షేప్ మినియేచర్. 

జాతీయ బాలల దినోత్సవం -2018

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 14-11-2018 న మన తపాలా శాఖా రెండు తపాలా బిళ్ళలు మినియేచర్ తో కలిపి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా బాలలకు చిత్రలేఖన పోటీలు "మత సామరస్యం"(Communal Harmony) అనే అంశం పై నిర్వహించి వాటిలో ఉత్తమమైన వాటిని ఈ తపాలా బిళ్లలపై ముద్రించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక తపాలా కవర్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 10,11 అక్టోబర్ 2018 న తొమ్మిది   ప్రత్యేక తపాలా కవర్లు (AP/17to 26/2018) విడుదల చేసింది. వీటిపై పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు, హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు, చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి వార్ల  భిన్న చిత్రాలతో ఈ 9 కవర్లు ఉన్నాయి.  వీటి అన్నింటిపై ఒకే  శంఖు ,చక్ర ,నామ లతో ప్రత్యేక తపాలా ముద్ర  ఉన్నాయి  పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి సింహ  వాహనం పై వెంటేశ్వర స్వామి ముత్యాల పందిరి  వాహనం పై మలయప్ప స్వామి సర్వభూపాల వాహనం పై శ్రీనివాసుడు  కల్ప వృక్ష వాహనం పై శ్రీ మలయప్ప స్వామి  గరుడ  వాహనం పై  శ్రీనివాసుడు  మోహిని అవతారంలో శ్రీ మహా విష్ణువు 

ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ - My Stamp

India post issued   My Stamp (64th Issue) postal sheet on  Andhra Pradesh Tourism on 26-6-2018 ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ  వారు మన తపాలా శాఖ వారు కలసి మై స్టాంప్ లో భాగంగా నవ్యంధ్రలో ఉన్న మొదటి స్థానంలో ఉన్న 12 ప్రముఖ పర్యాటక ప్రదేశాలపై పోస్టల్ స్టాంప్స్ ను 26 జూన్ 2018 న విడుదల చేశారు.  ఈ తపాలా బిళ్ళల వెల ఒక్కటి 5 రూపాయలు కానీ,మొత్తం  12 తపాలా బిళ్ళలు ఉన్న షీట్ వెల మాత్రం  500 రూపాయలు.  వీటిపై మన నవ్యంధ్ర లో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలు తిరుమల, విజయవాడ కనకదుర్గ , శ్రీశైలం దేవాలయం, కృష్ణా గోదావరుల పవిత్ర సంగమం, అమరావతి ధ్యాన బుద్ధ , గండికోట , చంద్రగిరి కోటలు, విశాఖ పట్నం RK బీచ్, అరకు లోయ బుర్రా గుహలు, గిరిజన ప్రదర్శన శాల, పాపి కొండలు, పులికాట్ సరస్సు  వంటి అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.  Tirumala Temple తిరుమల దేవాలయం    Kanak Durga Temple, Vijaywada, కనకదుర్గ దేవాలయం, విజయవాడ                      శ్రీశైలం దేవాలయం ...