Skip to main content

Posts

Showing posts from April, 2015

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఎప్పుడో  2000 ఏళ్ల క్రితమే    ఆంధ్రుల రాజధాని గా    విలసిల్లిన  ధాన్యకటకం ( ధరణికోట) ఆ  తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం. Amaravathi  Sculpture  India Post Issued a Commemorative postage stamp on  19 - 06 - 2003  on Amaravathi Sculpture preserved  at Govt. Museum -Chennai Govt. Museum -Chennai ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్విలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చి

శ్రీ వెంకటేశ్వర బాల కుటిర్ - గుంటూరు, స్వర్ణ జయంతి

I ndia Post released a special Cover on the occasion of Golden Jubilee of Sri Venkateswra balakuteer, Guntur, A.P.  on 18th March 2015 .  Shool emblem is used as a special cancellation on cover. గుంటూరులో Dr.N. మంగాదేవి గారిచే స్థాపించబడి గత 50 ఏళ్ళగా విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ వెంకటేశ్వర బాల కుటిర్ స్వర్ణోత్సవ సందర్బంగా మన తపాల శాఖ ఒక ప్రతేక తపాల కవరు 18-3-2015 న విడుదల చేశారు.   ప్రత్యేక తపాల ముద్ర గా  దీనిపై విద్యాశాల చిన్హం ను వాడారు.  Golden Jubilee  of Sri Venkateswra Balakuteer, Guntur

కందుకూరి వీరేశలింగం పంతులు

A Commemorative postage stamps on Kandukuri veeresalingam Date of Issue :  15 - 07 - 1974 కందుకూరి వీరేశలింగం పంతులు ( 1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు, తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఎన్నో నాటకాలు రాసిన కవి. ఏప్రియల్ 16 న జరిగే వీరి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగస్థల కళాకారుల దినోత్సవంగా జరుపుతున్నది.  ఆయనకున్న ఇతర విశిష్టతలు మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ,   తెలుగులో తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర  మరియు   తొలి ప్రహసనం రాసింది కుడా  కందుకూరే . కం

INIDA- FRANCE JOINT ISSUE

India post issued a set of two stamp and miniature sheet on 10-4-2014 on India -France 50 years of space co-operation. The miniature has been  incorporated with QR code for the first time in India. Since the 1990's CNES (Centre National d’Etudes Spatiales) and ISRO (Indian Space Research Organization) have been collaborating together and the collective efforts have resulted in the launch of space missions - Megha-Tropiques in 2011 and SARAL in 2013.

కాకినాడలో తపాల బిళ్ళల ప్రదర్శన

Numismatic and Philatelic Society of East Godavari is organizing ‘EGNPEX – 2015’ philatelic exhibition from 15th – 17th May 2015 at Kakinada,Andhra pradesh. తూర్పు గోదావరి నాణేలు, తపాల బిల్లల సేకరణ సంఘం వారిచే కాకినాడ లో తపాల బిళ్ళల ప్రదర్శన  ‘EGNPEX – 2015’ మే 15,16,17 తేదిలలో జరుగుతుంది. ఈ సందర్బంగా 5 ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేయబోతున్నారు.  Venue:  Suryakalamandir, Kalpana Centre, Anandha Bharathi Road,  Surya Rao Peta, (Cinema Hall Road), Kakinada – 533 001.