Skip to main content

Posts

Showing posts from 2015

రోజు వారి వాడకం కొరకు కొత్త తపాల బిళ్ళలు -1

India Post Issued new 11th series of  Definitive Stamps in the name of    Builders of Modern India మన తపాల శాఖ లో రోజు వారి వాడకం కొరకు  నవభారత నిర్మాతల వరసలోని   ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బొమ్మలతో చెలామణిలో ఉన్న తపాల బిళ్ళల స్థానంలో 15-10-2015 నుండి కొత్త  5 రూపాయల  తపాల బిళ్ళలు వాడకం లోకి వచ్చాయి.  భగత్ సింగ్ , స్వామి వివేకానంద, దీనదయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ. బాబు రాజేంద్ర ప్రసాద్ , మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రామ్ మనోహర్ లోహియా ల బొమ్మలతో వీటిని విడుదల చేసారు.   ఇదే వరసలో మరికొన్ని త్వరలో రాబోతున్నాయి.   భగత్ సింగ్ స్వామి వివేకానంద దీనదయాల్ ఉపాధ్యాయ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. బాబు రాజేంద్ర ప్రసాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్   రామ్ మనోహర్ లోహియా

Zoological Survey of India

Two Commemorative Stamps and one miniature issued by India Post on Zoological Survey of India  on 3rd December 2015. Zoological Survey of India 

భారత్- సింగపూర్ రాష్ట అధినేతల భవనాలపై తపాల బిళ్ళలు

India Post issued a set of two commemorative postage stamps   On the occasion of 50th anniversary of the establishment of diplomatic relations between Singapore and India on 24-11-2015 . The stamps depicted  Rashtrapati Bhavan (India) and Istana (Singapore), at Istana, Singapore     రాష్ట్రపతి భవన్ - భారత్ ఇస్తానా -  సింగపూర్

మహా కవి గురజాడ

India Post Released one  Commemorative  postal stamp  on Great Telugu Poet and  writer  Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013. మన భారత తపాలా శాఖ  మహా కవి  గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సం దర్బంగా  21-09-2013  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.      Gurajada Venkata Apparao గురజాడ వెంకట అప్పారావు (జ. 21-09-1862 - మ. 30-11-1915) దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్   వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్  అని వేలుగేత్తి చాటిన  తెలుగు జాతి వైతాళికుడు మహాకవి  గాసట బీసట గాధలతో , గజిబిజి గా ఉన్న  గ్రాంధిక  తెలుగు సాహిత్యాన్నిసామాన్యులకు చేరువచేసి భాషను సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ ఒకడు. హేతువాది.  19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కు...

పట్టాభి సీతారామయ్య

India Post realesed a Commemorative postage stamp on  Dr. PATTABHI SITARAMAYYA 17 -12-1997 Dr. PATTABHI SITARAMAYYA డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1957)  ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ కు 1948 లో అధ్యక్షుని గా పనిచేసిన గాన్దేయ వాది. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు. భారత జాతీయోద్యమ సమయంలో ఉద్యమంలో చేరి మహాత్మాగాంధి అనుచరుడిగా కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు.  1939 లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అద్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ, 1948 లో తిరిగి కాంగ్రెస్ అద్యక్షులుగా గెలుపొందారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్య ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. తెలుగు భాషాబిమాని గా తాను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు.  తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను చేసారు.వీరి గౌరవార్దం 17-12-1997 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. Dr.Pattabhi Sitharamayyah- First day cover

ఆచార్య యన్. జి. రంగా

India post released a Commemorative Postage Stamp on N.G.Ranga on 27th January  2001 under personlity series. రైతుబంధు ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు,27th జనవరి 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు. Prof.N.G.RANGA (7 Nov1900–9 June 1995) ప్రపంచ కర్షకులారా ఏకంకండి ! ఈ నినాదానికి రూపశిల్పి ఆచార్య గోగినేని రంగనాయకులు ( యన్. జి. రంగా). రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ ' అని గ్రంధస్థం చేసిన వ్యక్తి. గాంధీజీ స్వతంత్ర్యోద్యమంలో భాగంగా 1933 లో ప్రకటించిన క్లారియన్ పిలుపునందు కున్న స్వతంత్ర సమరయోధుడు. 1936లో కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించిన ధైర్యశాలి. ఆరు దశాబ్దాలకాలం ప్రజాసేవ చేసిన ప్రజ్ణామూర్తి. 1900 సంవత్సరం నవంబర్ 7 న గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలో జన్మించిన రంగా, స్వగ్రామంలోనే ప్రాధమిక విద్యను అభ్యసించి. గుంటూరులోని ఆంధ్ర-క్రిష్టియన్ కాలేజీలో పట్టభద్రులవగా, 1926లో ఆక్స్ ఫర్డ్ విశ...

Third Africa-India Forum Summit

 India Post released a Set of Six commemorative stamps and Miniature Sheets on Third Africa-India Forum Summit (AIFS-III) at New Delhi on 29th October, 2015.

Commemorative Stamps on Charkha

Dr. A.P.J . అబ్దుల్ కలాం కు తపాల బిళ్ళ

India Post released the commemorative stamp on the former President of India,  Dr. A.P.J. Abdul Kalam, on his 84th birth anniversary celebrations, at  New Delhi on 15th October, 2015. మన11 వ భారత రాష్ట్రపతి, మిసైల్ పితామహుడు ,భారత రత్న Dr. A,P.J. అబ్దుల్ కలాం  గారి గౌరవార్దం మన తపాల శాఖ 15-10-2015 న ఒక స్మారక తపాల బిళ్ళను విడుదల చేసింది. 

మాజీ కేంద్ర మంత్రి శ్రీ M . S సంజీవరావు పై ప్రత్యేక తపాల కవరు

A special cover on Dr. M. S. Sanjeevi Rao was released by India Post on 3rd September 2015  మాజీ కేంద్ర మంత్రి శ్రీ M . S సంజీవరావు పై విడుదలైన ప్రత్యేక తపాల కవరు 

తపాల బిళ్ళ పై సామ్రాట్ అశోకుడు

India Post released a commemorative stamp on Samrat Ashok on 24 August 2015 మన తపాల శాఖ 24-08-2015 న  సామ్రాట్ అశోకుడు పై ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  అశోకుడు క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. మన జాతీయ చిహ్నం సారానాద్ లోని అశోక స్తంబం నుండి స్వీకరించబదినది. అలాగే మన జాతీయ జండాలో అశోకుని ధర్మచక్రం ఉంచబడినది.   

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా ప్రత్యేక తపాల కవర్లు

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా   మన తపాల శాఖ  13-07 2015 న రాజమండ్రి లో గోదావరి నదిపై ఉన్న ప్రసిద్ది చెందిన హవేలోక్ ఆర్చ్ వంతెన పై ఒకటి , గోదావరి సాగర సంగమ ప్రాంతం అయిన అంతర్వేది పై ఒకటి , 15-07-2015 న  రాజమండ్రి కోటిలింగాలు వద్ద ఉన్న అతి పొడవైన స్తానవాటిక పై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.   అలాగే తెలంగాణ లో 14-07-2015 న గోదావరి నది తెలుగు నేల పై అడుగు పెట్టిన ప్రదేశం ' కందకుర్తి ' పై ఒకటి ( ఈ గ్రామం గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణీ సంగమ స్థలంలో ఉన్న తీర్థక్షేత్రం) ,కాళేశ్వర స్వామి దేవాలయం పై ఒకటి , పోచంపాడు లో గోదావరిపై కట్టిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ పై మరొకటి  రెండు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. On the occasion of Godavari Puskaralu 2015 Four special covers were released on 13th, 14th,15th July 2015.  With respect to Telangana state One special cover was released on  Kandakurthi-Triveni Sangamam and second was on  Sriram Sagar Irrigation Project, Pochampadu . With respect to Andhra Pradesh one special cov...

రణరంగ చౌక్ - తెనాలి

A Special cover Issued by Indian Post on 1-11-2007 in APPEX -2007, held at  Vishakhapatnam. This Special cover depicts -  Ranarang chouk -Tenali ,Guntur dist. విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ( APPEX -2007 ) 1-11-2007న  ఒక  ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసారు.  దానిపై   తెనాలి లో ఉన్న స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు. దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మహాత్మా గాంధీ బొమ్మను ఉపయోగించారు Special cover on  Ranarang chouk -Tenali మన దేశ స్వతంత్ర పోరాటం లో భాగం గా 1942 లో ఆగష్టు 9న జరిగిన ముంబాయి  కాంగ్రెస్ సమావేశంలో  సంపూర్ణ స్వరాజ్యాఉద్యమానికి నాంది పలుకుతూ   " క్విట్ ఇండియా " తీర్మానాన్ని ఆమోదించారు.  ఈ సభకు గుంటూరు జిల్లా నుండి   ప్రముఖ స్వతంత్రయోధుడు గాన్దేయవాది  శ్రీ కల్లూరి చంద్రమౌళి  గారి నాయకత్వంలో వెలవొలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు,అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి చౌదరి పాల్గొని వ...

గోదావరి పుష్కరాల పై తపాల బిళ్ళ

మన తపాల శాఖ 'మై స్టాంప్ ' పధకం లో భాగంగా గోదావరి పుష్కరాలపై 14-7-2015 న ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను విడుదల చేసింది. అన్ని ప్రధాన తపాల శాఖలలో వీటిని పొందవచ్చు. On the festive occasion of Godavari Pushkaram, India Post released fifth series of ‘My Stamp’ on Godavari Pushkaram 2015 theme on 14th July 2015.  The template is having image of Godavari River and sheet of 12 stamps depicts the Godavari Arch Bridge, a bowstring-girder bridge that spans the Godavari River in Rajahmundry and photo of Godavari Maha Aarti at Rajahmundry, Andhra Pradesh. గోదావరి పుష్కరాల పై తపాల బిళ్ళ

గోదావరి పుష్కరాలు - మేఘదూత్ పోస్ట్ కార్డ్స్

గోదావరి నది  భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, కరీంనగర్, వరంగల్,ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములోసంగమిస్తుంది.ప్రతి పండెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రతి 12 వ పుష్కరం ను మహా పుష్కరం అని అంటారు . ఇది 144 ఏళ్లకు ఒక సారి వస్తుంది.  2015 జూలై 14 నుండి గోదావరికి మహా పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్బంగా మన తపాల శాఖ తెలుగు మరియు హిందీ భాషలలో రెండు మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ను విడుదల చేసింది.  MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015   MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015   గోదావరి పుష్కరాలు-2003(30-07-2003 నుండి 10-08-2003 ) కు రాజమండ్రి కి  యాత్రికులకు స్వాగతమ పల...

కాకినాడ EGNPEX – 2015 లో ఐదు ప్రత్యేక తపాల కవర్లు విడుదల

India Post released Five special Covers on the occasion of  philatelic exhibition  'EGNPEX-2015' held  on 15th – 17th May 2015 at Kakinada, Andhra pradesh. తూర్పు గోదావరి నాణేలు, తపాల బిల్లల సేకరణ సంఘం వారిచే కాకినాడ లో  2015 మే 15,16,17 తేదిలలో  జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన  ‘EGNPEX – 2015’ లో ఐదు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు.  మొదటి రోజు 15-5-2015 న అభినవ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ కు ఒకటి , అపర భగీరధుడు సర్ ఆర్దర్ కాటన్ కు ఒకటి బోజ్జనకొండ, లింగలమెట్టు లో బౌద్ద ఆరామలపై  ఒకటి మొత్తం మూడు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు.   రెండవ రోజు 16-5-2015 న కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం పై ఒకటి , నాదయోగి సంగీత కళానిధి నేదురమల్లి కృష్ణ మూర్తి పై మరొకటి  వెరిసి రెండు రోజులలో ఐదు  ప్రత్యేక తపాల   కవర్లు   విడుదల చేసారు.  Special cover on Smt. Dokka Seethamma (Annapurna) ( AP/8/2015).   Special cover on  Sir Arthur Thomas Cotto...

జిడ్డు కృష్ణ మూర్తి

India Post Issued a Commemorative  postage stamp on  Jiddu Krishnamurti on    11-05-1987  Jiddu Krishnamurti  ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) మదనపల్లి లో జన్మించారు.కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ " ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్దాపించి కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. మొదట తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. జగద్గురువుగా అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి వాటికి విలువ ఇవ్వక తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తన విశ్వాసానికి విరుద్దంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా వుండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచ లేదు. చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " ను రద్దుపరచాడు. తాను జిడ్డు ...

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఎప్పుడో  2000 ఏళ్ల క్రితమే    ఆంధ్రుల రాజధాని గా    విలసిల్లిన  ధాన్యకటకం ( ధరణికోట) ఆ  తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం. Amaravathi  Sculpture  India Post Issued a Commemorative postage stamp on  19 - 06 - 2003  on Amaravathi Sculpture preserved  at Govt. Museum -Chennai Govt. Museum -Chennai ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దము...