ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు జరిగి వైభవంగా ముగిసినది. 2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన తపాలా బిళ్ళల ప్రద్రర్శన (APPEX -2014) లో తెలంగాణా ,ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి తపాల బిళ్ళల సేకరణ కర్తలు పాల్గొని తమ తమ సేకరణలను ప్రదర్శించారు. ఈ సందర్బం గా తపాలా శాఖ వారు ఆరు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. వీటిలో మన తెలుగు వారి విశిష్టతను చాటేలా 'తెలుగు వెలుగులు ' పేరుతో తెనాలి కి చెందిన శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు అత్య అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక ప్రదర్శన కుడా ఇదే. ఈ ప్ర దర్శన కు సాయి కృష్ణ కు వెండి -రజిత ( SILVER- BRONGE ) పతకం బహుమతిగా వచ్చింది. తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ ప్రదర్శన విశేషాలను మన పాటకుల కొరకు తదుపరి టపాలో పరిచయం చేస్తాను...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.