ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మన పాలకులను ఎన్నుకోవాలి. స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం. దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి. ఓటు విలువ పామరులకు తెలియజేయాటానికి అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయానికి విస్తృతం గా ప్రచారం చేయటానికి మన తపాలా శాఖ 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయం లోనే ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 13-1-1967 న విడుదల చేసింది. 57 ఏళ్ళు అయినా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు. అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి ఓటు అమ్ముకున్న అమాయకులను
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.