పూజ్యశ్రీ నారాయణ తీర్థ ల వారి ౩౩౦ వ జయంతి సందర్బంగా మన తపాల శాఖా వారు 11-2-2006 న ఒక ప్రత్యేక కవరు విడుదల చేశారు. Special cover on Swamy Narayanatirtha by Indian Post on 16-07-2005 ప్రముఖ వాగ్గేయ కారుడు కూచిపూడి నృత్యంలో శ్రీ కృష్ణ లీలా తరంగిణి రూపకర్త పూజ్యశ్రీ నారాయణ తీర్దులు ( 1675-1745) అసలు పేరు గోవింద శాస్త్రి. వీరు క్రీ.శ. 17వ శతాబ్దములో గుంటూరు జిల్లా కాజ గ్రామములో తల్లావజ్జుల నీలకంఠశాస్త్రి, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. అతి చిన్న వయసులోనే సంగీతము, సంస్కృతము, శాస్త్రాలు అభ్యసించాడు. చిన్నవయసులోనే వివాహము జరిగింది. నారాయణ తీర్థ చిన్నతనమునుండే పూజలు, భగవన్నామస్మరణం చేస్తుండేవాడు. స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యముతో సన్యాస దీక్షాముఖముగా పయనించాడు. నారాయణ తీర్థ సంగీత సంస్కృత భాషాపరిజ్ఞానానికి శివానందతీర్థ మెరుగులు దిద్దాడు. భూపతి రాజపురములో స్థిర నివాసమేర్పరచుకొని "శ్రీ కృష్ణలీలాతరంగిణి" కావ్యము వ్రాశాడు. ఒక కావ్యానికి కావలిసిన మూడు ప్రధానాంశాలు పద్యము, గద్యము, వచనము కావ్యములో అతి చక్కగా చిత్రీకరించాడు. నాట్యానికి కావలిసిన జతులు, కృతులు పొందుపరచ బడ్
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.