India post issued a Commemorative postage stamp on freedom fighter, social worker Amarajivi POTTI SRIRAMULU on 16 - 3 - 2000 POTTI SRIRAMULU ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు (1901-1952) ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మ గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. స్వతంత్ర సమర యోధుడు . ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19 న మహర్షి బులుసు సాంబ మూర్తి గారి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు .56 రోజులు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15 న పొట్టి శ్రీరాములు, ఆంద్ర రాష్ట్ర ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 16 మార్చ్ 2000 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు . FDC -POTTI SRIRAMULU
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.