First Day Cover -K. Bramhananda Reddy India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011. కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. KASU BRAHMANANDA REDDY శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు. 1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.