A commemorative stamp Issued by Indian Post On Chaudary Charan Singh, The fifth prime minister of India. Date of Issue : 29 -5 - 1990 First day cover on _ Chaudary Charan Singh రైతు బాంధవుడు , కర్షక మిత్రుడు, గాన్దేయ వాది, మాజీ ప్రధాన మంత్రి శ్రీ చౌధరీ చరణ్ సింగ్ (1902 - 1987 ) 23 - 12 - 1902 వ సంవత్సరములో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ లో జన్మించాడు. 1923లో సైన్సులో పట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన ఆ తరువాత న్యాయవిద్య అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్ కి చేరి ఆ తదనంతరం కాంగ్రేసు పార్టీలో చేరాడు. 1937లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నుండి ఎన్నికై ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 మరియు 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు. 1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవిన్యూ, ఆరోగ్య మరియు సాంఘీక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు. 1951 జూన్ లో రాష్త్రములో కేబినెట్ మంత్ర...