Skip to main content

గండికోట

CUDAPEX -Special cover on  Gandikota  
Date of issue : 12 -11 -1976  
12 -11 - 1976 న జరిగిన కడప జిల్లా తపాలా బిల్లల ప్రదర్శనలో (76 CUDAPEX)జమ్మలమడుగు మండలం లో పెన్నా నది తీరంలో ఉన్న చారిత్రిక ప్రసిద్ధి చెందినదుర్గం  "గండికోట" పై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. బత్తాయి పళ్ళు ఉండే పోస్టల్ ముద్ర తో కాన్సిలేషణ్ రూపొందించారు.
గండికోట చరిత్ర :
గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని మలికి  సీమకు రాజధానిగా ఉండేది. 14 వ శతాబ్దం ప్రథమార్థం నుండి 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగము వరకు గండికోటను పెమ్మసాని కమ్మనాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, 1650 ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు
వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.
గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. 

Comments

కమల్ said…
కోడాలి శ్రీనివాస్ గారు, మంచి సమాచారం ఇచ్చారు. నా బ్లాగ్‌లో గండికోట చరిత్ర, సమాచారం ఇంకా విపులంగా ఉన్నది మీకు సమయం ఉంటే నా బ్లాగ్ ని చూసి అందులోని తప్పులుంటే తెలియజేయగలరని నా మనవి.

http://mahavarnam.blogspot.com/
ఇందు said…
నేను ఇక్కడికి వెళ్ళానండి...చాలా బాగుంటుంది ఈ కోట...అంతా శిధిలావస్థ లో ఉన్నా ఎంతొ గంభీరంగా,ఠీవి గా ఉన్న ఈ కోట ని కడప జిల్లలో నాకు నచ్చిన ప్రదేశం....పక్కనే ఎన్నో అడుగుల లొతులో ప్రవహించే పెన్నానది ఈ కోట ని చుట్టి వస్తుంది...పూర్వం ఇదే కోట కి రక్షణగా నిలిచేదని కథనం..

Popular posts from this blog

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.