Skip to main content

Posts

Showing posts from February, 2010

శ్రీశైలం-Pictorial Cancellations

ప్రత్యేక పోస్టల్ ముద్ర - శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం Pictorial Cancellations – Inaugural Cover- Srisailam A Pictorial Cancellation was introduced at Srisailam on Lord Mallikarjuna Temple on 07 Mar 1978 . An Inaugural special cover was issued to commemorate the Event. The Cancellation shows Temple and cover Shows Lord Mallikarjuna and Bhramaramba. Srisailam is a Holy town situated in Nallamala Hills of Kurnool District of Andhra Pradesh on the banks of River Krishna.

అపోలో హాస్పిటల్స్- APOLLO HOSPITALS

అపోలో హాస్పిటల్స్ - APOLLO HOSPITALS - 2-11-2009 వైద్య , ఆరోగ్య విషయాలలో విశేషమైన సేవ చేస్తున్న అపోలో వైద్య శాలల రజితోత్సవాన్ని పురస్కరించుకొని భారత తపాల శాఖ విడుదల చేసిన ఐదు రూపాయల తపాల బిళ్ళ మరియు ఫస్ట్ డే కవర్

వేమన

VEMANA - 17th century ప్రజా కవి వేమన ౩౦౦ వ జయంతి సందర్బంగా అక్టోబర్ 16 , 1972 న విడుదలైన 20 పైసల తపాల బిళ్ళ. " విశ్వదాభిరామ వినురవేమ " అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యా లు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలిది తో అద్భుతమైన కవిత్వం , అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, వి లువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, హేతువాది మన యోగి వేమన.

బి.యన్. రెడ్డి

India Post released A commemorative postage stamp onB.N. REDDI on 16th November 2009 పద్మ భూషణ్ బి.ఎన్.రెడ్డి గారు తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాయాబ్ ఫాల్కే అవార్డ్ పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు ఎన్నో మన కళ్ళ ముందు కదలాడతాయి.వాటిలో ముఖ్యమైనవి - మల్లీశ్వరి ,బంగారు పాప,రాజ మకుటం. వీరి గౌరవార్థం మన తపాలా శాఖ 16-11-2009 న ఒక తపాలా బిళ్ళ విడుదల చేసింది. 

బులుసు సాంబమూర్తి

విడుదల తేది:04th March 2008 A commemorative postage stamp on ' MAHARSHI BULUSU SAMBAMURTHY' మహర్షి బులుసు సాంబమూర్తి : స్వతంత్ర యోదుడు , గాన్దేయ వాది . గాంధీజీ పిలుపునందుకొని న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. వీరు 1919లో హోంరూల్ ఉద్యమంలోను, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను మరియు నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. తరువాత వీరు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగాను, 1929లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగాను, 1935-37 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగాను వ్యవహరించారు.విశాలాంద్ర కొరకు పోరాడిన మహనీయుడు.మద్రాసులో వీరి గృహంలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంద్ర రాష్ట్రం కొరకు అసువులు బాశారు. 1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు. తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించిన వీరు మహర్షిగా 1958 పరమపదించారు

పోలీసు అకాడెమి -హైదరాబాద్

A commemorative postage stamps - 27th November 2008 sardaar vallabhaayi patel National police Academy Hyderabad సర్దార్ వల్లభాయ్ పటేల్ పొలిసు ఆకాడమి , హైదరాబాద్ స్వర్ణోత్సవ సందర్భంగా ( 1948-2008) విడుదలైన తపాల బిళ్ళలు మరియు మినిఏచర్ - 27th November 2008

తపాల బిళ్ళ పై కలంకారి

A commemorative postage stamp on 10th December 2009 TRADITIONAL INDIAN TEXTILES KALAMKARI పోస్టల్ శాఖ వారు మన కలంకారి చేనేత వారి ప్రతిభను గుర్తించి ఒక ప్రత్యేక ఐదు రూపాయల విలువగల్ల తపాల బిళ్ళను విడుదల చేసారు . మన కలంకారి తో పాటు కంచి పట్టు , ఆపతాని చేనేత , బెనారస్ సిల్కు లకు కుడా ఈ గౌరవం దక్కింది . ఈ స్టాంప్స్ తో పాటు ఈ నాలుగు సాంప్రదాయ చేనేత వస్త్రాల కు ఒక మినిఏచర్ కుడా విడుదల చేసారు .

ప్రత్యకమైన పోస్టల్ ముద్ర - Pictorial Cancellations

చారిత్రాత్మక ప్రదేశాలకు , కట్టడాలకు ప్రత్యకమైన పోస్టల్ ముద్రను ( Pictorial Cancellations) కేటాయించి వాటి విశిష్టతను తెలియజేస్తారు . ఈ పిటోరియాల్ ముద్రలు మన ఆంధ్ర ప్రదేశ్ సంభందించిన వాటిని మీకు తెలియజేస్తాను . జమ-ఐ- ఉస్మానియా : Pictorial Cancellation was introduced at Jama-i- Osmania on 11 Oct 1976. An Inaugural special cover was issued to commemorate the Event. చార్మినార్: Pictorial Cancellation was introduced at Charminar , Hyderabad on 21 Apr 1975. An Inaugural special cover was issued to commemorate the Event.

పింగళి వెంకయ్య

A commemorative postage stamp on 12th August 2009 PINGALI VENKAIAH పింగళి వెంకయ్య ( 1878 - 1963 ) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త.పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రాధాన పాత్రధారిగా ఉన్నాడు. 1916 లో సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919 లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు.1921 లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కోత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వ