Skip to main content

Posts

Showing posts from December, 2018

UNESCO World Heritage Sites in India -1 రాజస్థాన్ లో కోటలు

యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు  UNESCO World Heritage Sites in India- 1, పేరుతో   29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  దీనిపై  ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లో గల ఆరు చారిత్రాత్మక కోటలు - 1. కుంభాల్ ఘర్, 2. చిత్తోర్ ఘర్, 3. జైసల్మేర్ , 4. గగ్రోన్, 5.రతంబోర్, 6. అజ్మీర్ హిల్ ఫోర్ట్  లు చోటుచేసుకున్నాయి. 

National Police Memorial

మన స్వాతంత్రం వచ్చిన 1947 నుండి నేటివరకు దేశ పౌరుల రక్షణలో ప్రాణాలు అర్పించిన 34484 మంది పోలీసుల స్మృతి చిహ్నం గా 21- 10 2018 న ఢిల్లీ లో నిర్మించిన జాతీయ పొలిసు మెమోరియల్ కు గుర్తుగా మన తపాలా శాఖ 22-12- 2018 న రెండు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.   

తపాలా కవరు పై పద్మ విభూషణ్ డా. అక్కినేని

తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారి 95వ జన్మదినం సందర్భంగా మన తపాలా విభాగం ఒక ప్రత్యేక తపాలా కవరును 19-09-2018 న హైదరాబాద్ లో విడుదల చేసింది. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.  SPECIAL COVER ON Dr. A.N.R.