మన తపాలా శాఖ 23-02-2018 న B. నాగిరెడ్డి పై తపాలా బిళ్ళ విడుదల చేసింది. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1912-2004) గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, విజయ వాహిని పిచ్చర్స్ అధినేత, చందమామ పత్రిక ముద్రాపకుడు, చక్రపాణి - నాగిరెడ్డి గా సుపరిచితుడు. దాదాసాయబ్ పాల్కే అవార్డు గ్రహీత అయిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నిర్మించిన సినిమాలలో పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ ప్రముఖమైనవి. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ప్రముఖ దర్శకుడు దాదాసాయబ్ పాల్కే అవార్డు గ్రహీత B .N. రెడ్డి ( బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి )గారు వీరి సోదరుడే. వారికి కూడా 16-12- 2009 లో మన తపాలా శాఖ ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.