Skip to main content

Posts

Showing posts from September, 2017

తపాలా బిళ్ళలపై రామాయణం

దసరా పండుగ సందర్భంగా మన తపాలా శాఖ హిందూ మత  ప్రామాణిక గ్రంధాలలో ప్రముఖమైన రామాయణ  గ్రంధం లోని ముఖ్య ఘట్టాలతో 11 తపాలా బిళ్ళల ను  22-09- 2017 న విశ్వవ్యాప్తంగా విడుదల చేసింది.  దీనిపై సీతా రామ స్వయంవరం, శ్రీ రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించటం , భరతునికి పాదుకలు ఇవ్వటం, గృహుడు చే నదిని దాటటం, జటాయువు చే సీతాపహరణ గురించి తెలుకోవటం , శబరి చే ఫలహారం స్వీకరించటం, హనుమంతుడు అశోకవనంలో సీత జాడ కనుగొనటం, లంకకు వారధి కట్టే సమయంలో ఉడుత సహాయం, లక్ష్మణుడి కొరకు హనుమ సంజీవని తెచ్చుట, రామ బాణంతో రావణ సంహారం (ఇవి అన్ని 5 రూపాయల విలువతో ఉన్నవి) మధ్యలో 15 రూ  విలువతో శ్రీ సీతారామ పట్టాభిక్షేకం  తో వీటిని రూపొందించారు.  తపాలా బిళ్ళలపై  రామాయణం  ఇంతకు ముందు 14-10- 1970 లో రామాయణ గ్రంధకర్త మహర్షి వాల్మీకి పై  ఒక తపాలా బిళ్ళను  విడుదల చేశారు. దీనిపై సీతా రామ లక్ష్మణ ల వనవాసం, బంగారు లేడి చిత్రాలు చూడవచ్చు.  Maharsi Valmiki Miniature sheet - Ramayana Sheet let - Ramayana

చలపతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIET) - గుంటూరు

A special cover was released to celebrate 10 year of Chalapathi Institute of Engineering and Technology (CIET) on 19th March 2017. ఇంజనీరింగ్ విద్య కొరకు లాం ఆవరణలో 2007 లో చలపతి ఇన్స్టిట్యూట్  అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIET) స్థాపించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా కవర్ 19-3-2017 న విడుదల చేసింది.  Chalapathi Institute of Engineering and Technology (CIET) 1996 లో  స్థాపించబడిన చలపతి విద్యాలయాలు గుంటూరు ప్రాంత వాసులకు విద్యనందిస్తున్నాయి.  చలపతి ఎడ్యుకేషనల్ సంస్థ క్రింద నర్సరీ నుండి పది వరకు విద్య బోదన కొరకు చలపతి ప్రైమరీ మరియు  హై స్కూల్ , ఇంటర్ కొరకు చలపతి జూనియర్ కాలేజీ, డిగ్రీ కొరకు చలపతి డిగ్రీ కాలేజీ లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు బి.ఫార్మా,ఫార్మాడీ, యం.ఫార్మా  విద్య  కొరకు చలపతి ఫార్మా కాలేజీ(CIPS) 2005 లో స్తాపించబడినది. ఇంజనీరింగ్ విద్య కొరకు  2007 లో చలపతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIET ) పేరుతో  లాం ఆవరణలో  ఒక ఇంజనీరింగ్ కాలేజీ, 2008 లో చలపతి ఇన్స్టిట్...