Skip to main content

Posts

Showing posts from April, 2017

ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల

India Post released a set of 3 stamp of Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana on 26th April 2017. భారత తపాలా 26-04-2017 న మన తెలుగు కవయిత్రులు   శ్రీ వెంకటాచల  మహత్యం రాసిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ (1730-1817)   మరియు  ఆతుకూరి ( కుమ్మరి) మొల్లమాంబ  (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)రామాయణ కల్పవృక్షం తో పాటు  వేయి పడగలు రాసి జ్ఞానపీట్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయత,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గార్ల పై  గుంటూరు బృందావన్ గార్డెన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని అన్నమయ్య కళావేదికపై 26-04- 2017 సాయంత్రం గ  6.15  ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. ఒకేసారి ఇలా ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల కావటం శుభపరిణామం. దీనికి కృషి చేసిన పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి అభినందనలు.    Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana

ఉస్మానియా విశ్వవిద్యాలయం

శత వంసంతాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందనాలు.  ఈ విశ్వవిద్యాలయానికి 50 వసంతాలు నిండిన వేళ స్వర్ణోత్సవ సందర్భంగా 15-3-1969 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  A Commemoretive postage stamp on 15 - 3 - 1969 Osmania university - Hyderabad OSMANIA UNIVERSITY- FIRST DAY COVER ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7 వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1918 లో స్థాపించబడింది . భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7 వ ప్రాచీన సంస్థగా , దక్షిణ భారతావనిలో 3 వ సంస్థగా పేరుగాంచింది . ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ . 1,600 ల ఎకరాల (6 చ . కి . మీ .) సువిశాల ప్రాంగణంతో , అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు . నిజాం రాజ్యానికి వచ్చి 25 ఏళ్ళు గడిచిన సందర్భంగా హైదరాబాద్ స్టేట్ తపాలా శాఖ 1936 లో ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది...

శ్రీ వెలగపూడి రామకృష్ణ - My Stamp

వెలగపూడి రామకృష్ణ గారు దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖ 30-12- 2016న ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది Sri Velagapudi Rama Krishna శ్రీ వెలగపూడి రామకృష్ణ గారు 1896లో గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా,నగరం మండలములోని బెల్లం వారిపాలెం అను గ్రామములో జన్మించాడు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎంఏ విద్య నభ్యసించాడు.బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర, సిమెంటు తయారు చేయు పరిశ్రమలు ముఖ్యమైనవి. రామ కృష్ణ గారు 1941 లో స్థాపించిన KCP Limited 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మన తపాలా శాఖ వారి సౌజన్యం తో వ్యక్తిగత తపాలా బిళ్ళను 30-12-2016 న విడుదల చేసారు. వారిపై ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయాలని ఆశిస్తున్నాం. My Stamp sheetlet  on 75 Years of KCP ...

దీక్షాభూమి

On the occasion of Dr. B. R. Ambedhkar 126 birth anniversary  India Post released a Se-tenant stamp on Deekshabhoomi on 14th April 2017 at Nagpur. డా. బి.ఆర్. అంబేద్కర్ 126 వ జయంతి సందర్భంగా మన తపాలా శాఖ 14-04-2017న ఒక సి-టెనెంట్ (జంట -బిళ్ళలు) దీక్షాభూమి పేరుతో విడుదల చేసింది.   అశోక విజయ దశమి (14-10- 1956) న నాగపూర్ లో  అంబేద్కర్ తన అనుచరులతో కలసి బౌద్ధం స్వీకరించిన ప్రదేశం లో నిర్మించిన బౌద్ధ ఆరామం ఈ దీక్షాభూమి.