Skip to main content

Posts

Showing posts from December, 2016

మన అమర గాయకులు

మన తపాలా శాఖ 30-12-2016 న పది మంది అమర గాయకులు గౌరవార్థం ఒకేసారి పది తపాలా బిళ్లలను విడుదల చేసింది. వీటిపై షంషాద్ బేగం, గీతా దత్, హేమంత కుమార్ , ముఖేష్ , కిషోర్ కుమార్ , మహ్మద్ రఫీ, మన్నాడే, తలత్ మహమూద్, భూపేన్ హజారికా, టి. యం. సౌందర్యరాజన్ చిత్రాలు చోటుచేసుకున్నాయి. 

సామ్రాట్ విక్రమాదిత్య

మన తపాలా శాఖ 22-12-2016 న సామ్రాట్ విక్రమాదిత్య పై ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఉజ్జయిని రాజధానిగా ప్రజలను జనరంజకంగా పాలించిన విక్రమాదిత్యుని కొలువులో భట్టి అనే మంత్రి ఉండేవాడని , వారు ఇద్దరు దేశ సంచారం చేసి రకరకాల సమస్యలను నివృత్తి చేశారనే కధలు "భట్టి విక్రమార్క కథలు" ( భేతాళ కథలు) పేరుతో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అలాగే గుణాఢ్యని కథాసరిత్సాగరం  లోను, బృహత్కథామంజరి లోను విక్రమాదిత్యుని గురించి గొప్పగా చెప్పబడినది .  క్రీస్తు పుట్టకముందు 57 ఏళ్ళనుండి మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వీరి పేరుతో 'విక్రమ శకం' పేరుతో కాలమానం ఉంది.  చరిత్రకు అందని ఈ సామ్రాట్ విక్రమాదిత్య పై తపాల బిళ్ళను విడుదల చేయటం ముదావహం.  Samrat Vikramadittya 

కూచిపూడి నృత్యం

The Sangeet Natak Akademi currently confers classical status on six Indian classical dance styles: namely Bharatanatyam(TamilNadu), Kathak (North India), Kathakali (Kerala), Kuchipudi (Andhra Pradesh), Manipuri (Manipur), Odissi(Odisha), India Post Issued a set of six stamps on these Indian classical Dances on  20-10-1975   KUCHIPUDI - DANCE మన భారతీయ సాంప్రదాయ నృత్య రీతులను సుప్రసిద్ధం చేయటానికి తపాల శాఖవారు 20-10-1975 న ఆరు తపాల బిళ్ళలనువిడుదల చేసారు. వాటిలో మన తెలుగు వారి సాంప్రదాయపు కూచిపూడి నాట్యానికి  కుడాచోటు  లభించింది.    ప్రమంచవ్యాప్తంగా తెలుగు వారికి కాళాజగత్తు లో ఒక గుర్తింపు తెచ్చిన నృత్యం కూచిపూడి నృత్యం.  భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది నవ్య ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. భరతనాట్యం తో కొంత సారూప్యం కలిగిన కూచిపూడి నృత్యం తనదైన ప్రత్యేక శైలి కలిగి ఉంటుంది. దీని రూపకర్త 15 వ శాతబ్దికి చెందిన సిద్దేంద్ర యోగి.  మన కూచిపూడి నాట్యం తో  పాటు దేశీయ నృత్య రీతులు అయిన  భరత నాట్యం, ఒడిస్సీ, కధాకళి ,మణిపూరి, హిందుస్తా

Greetings of Marry christmas

India post released a set of two postage stamps and a miniature   on 23-12-2016 in view of Season's Greetings of Marry Christmas   భారత తపాలా శాఖ క్రిస్టమస్ పర్వ దినం శుభాకాంక్షలు తెలుపుతూ రెండు ప్రత్యేక తపాలా బిళ్ళలు 23-12-2016 న విడుదల చేసింది. వీటిపై క్రిస్టమస్ వృక్షం , శాంతా క్లాస్ ( బహుమతుల క్రిస్టమస్ తాత) ముద్రించారు.  ఇంతకు ముందు 25-12-1999 న క్రిస్టమస్ పై ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు. ఏసు క్రీస్తు జయంతి -2000  70 ఏళ్ల తపాలా చరిత్రలో క్రిస్టమస్ కు విడుదల చేసిన తపాల బిళ్ళలు విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కావటం విశేషం. 

విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం

A special cover was released on the ocassion of the inauguration of Andhra Pradesh Postal circle at Vijayawada on 11th October 2016 నూతన ఆంద్ర ప్రదేశ్ కు విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం ఏర్పాటు సందర్భంగా 11-10-2016 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.  దీనిపై ఆంధ్రప్రదేశ్ పటం తో పాటు ఆంధ్రకు సంబంధించిన ఏడు తపాలా బిళ్ళల బొమ్మలు చూడవచ్చు.   Inauguration of Andhra Pradesh Postal circle 

అద్భుతమైన ఆలయం - అక్షరధామ్

Set of two Commemorative Stamps (Se-tenant pair) on Akshardham Temple, New Delhi and Pramukh Swami Maharaj was released by India Post on the occasion of Pramukh Swami Maharaj’s 96th Janma Jayanti Mahotsav held at Surat on 7th December 2016. దేశ రాజధాని న్యూ దిల్లీ లో గల అద్భుతమైన ఆలయం - అక్షరధామ్, దాని నిర్మాణ సూత్రధారి ప్రముఖ్ స్వామి మహారాజ్ ల పై మన తపాలా శాఖ 7-12-2016 న జంట తపాలా బిళ్ళలు విడుదల  చేసింది    Se-tenant-  Akshardham Temple, New Delhi and Pramukh Swami Maharaj

విదేశీ రామ చిలుకలు

Department of Posts issued six Commemorative Stamps and two Miniature Sheets on Exotic Birds  on 5th December 2016 .  మన తపాలా శాఖ 5-12-2016 న విదేశీ రామ చిలుకలు పేరుతో ఆరు తపాలా బిళ్ళలు రెండు మినియేచర్స్ విడుదల చేసింది. వీటిపై విదేశాలలో కనిపించే అందమైన చిలుకల చిత్రాలు ఉన్నాయి  Blue Throated Macaw, Sun Conure, Magnum Amazon Cape Parrot, Hyacinth Macaw and Lesser Sulphur Crested Cockatoo 

Andhra Pradesh Social Welfare Residential Educational Institutions

A special cover was released in Vijayawada on 27th October 2016 to celebrate 30 years of Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society.