Skip to main content

Posts

Showing posts from November, 2015

మహా కవి గురజాడ

India Post Released one  Commemorative  postal stamp  on Great Telugu Poet and  writer  Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013. మన భారత తపాలా శాఖ  మహా కవి  గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సం దర్బంగా  21-09-2013  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.      Gurajada Venkata Apparao గురజాడ వెంకట అప్పారావు (జ. 21-09-1862 - మ. 30-11-1915) దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్   వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్  అని వేలుగేత్తి చాటిన  తెలుగు జాతి వైతాళికుడు మహాకవి  గాసట బీసట గాధలతో , గజిబిజి గా ఉన్న  గ్రాంధిక  తెలుగు సాహిత్యాన్నిసామాన్యులకు చేరువచేసి భాషను సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ ఒకడు. హేతువాది.  19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కు...

పట్టాభి సీతారామయ్య

India Post realesed a Commemorative postage stamp on  Dr. PATTABHI SITARAMAYYA 17 -12-1997 Dr. PATTABHI SITARAMAYYA డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1957)  ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ కు 1948 లో అధ్యక్షుని గా పనిచేసిన గాన్దేయ వాది. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు. భారత జాతీయోద్యమ సమయంలో ఉద్యమంలో చేరి మహాత్మాగాంధి అనుచరుడిగా కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు.  1939 లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అద్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ, 1948 లో తిరిగి కాంగ్రెస్ అద్యక్షులుగా గెలుపొందారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్య ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. తెలుగు భాషాబిమాని గా తాను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు.  తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను చేసారు.వీరి గౌరవార్దం 17-12-1997 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. Dr.Pattabhi Sitharamayyah- First day cover

ఆచార్య యన్. జి. రంగా

India post released a Commemorative Postage Stamp on N.G.Ranga on 27th January  2001 under personlity series. రైతుబంధు ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు,27th జనవరి 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు. Prof.N.G.RANGA (7 Nov1900–9 June 1995) ప్రపంచ కర్షకులారా ఏకంకండి ! ఈ నినాదానికి రూపశిల్పి ఆచార్య గోగినేని రంగనాయకులు ( యన్. జి. రంగా). రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ ' అని గ్రంధస్థం చేసిన వ్యక్తి. గాంధీజీ స్వతంత్ర్యోద్యమంలో భాగంగా 1933 లో ప్రకటించిన క్లారియన్ పిలుపునందు కున్న స్వతంత్ర సమరయోధుడు. 1936లో కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించిన ధైర్యశాలి. ఆరు దశాబ్దాలకాలం ప్రజాసేవ చేసిన ప్రజ్ణామూర్తి. 1900 సంవత్సరం నవంబర్ 7 న గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలో జన్మించిన రంగా, స్వగ్రామంలోనే ప్రాధమిక విద్యను అభ్యసించి. గుంటూరులోని ఆంధ్ర-క్రిష్టియన్ కాలేజీలో పట్టభద్రులవగా, 1926లో ఆక్స్ ఫర్డ్ విశ...

Third Africa-India Forum Summit

 India Post released a Set of Six commemorative stamps and Miniature Sheets on Third Africa-India Forum Summit (AIFS-III) at New Delhi on 29th October, 2015.