ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని, వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం. అంగరంగ వైభవం గా 1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి. ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు హైదరాబాద్ లో 12 - 04 - 1975 న( ఉగాది పర్వదినాన ) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు . ఈ తపాల బిళ్ళ వెల 25 పైసలు . దాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు. A Commemorative postage stamp on world telugu conference Date of Issue - 12 -04 -1975 ' దేశ భాషల యందు తెలుగు లెస్స ' అన్న శ్రీ కృష్ణ
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.