A special cover Issued by India Post on 16-10-2003 in APPEX - 2003. The cover and cancellation Shows the Statue of Buddha in Hussen sagar,Hyderabad. హైదరాబాద్ లో ఉన్న హుస్సేన్ సాగర్‌లో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. తెలుగు వారికి దశ,దిశ చూపిన శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలం తో అనేక మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం స్థాపన సమయంలో నీట మునిగింది. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ప్రతిష్టించారు. ఈ చెరువు గట్టుపై ( టాంక్ బండ్) తెలుగు జాతి లో విశిష్టమైన స్థానం కలిగిన 33 మహనీయులు విగ్రహాలు ఉన్నాయి.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.