నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897) గారి 125వ జన్మదినం సందర్భంగా మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళను 23- 01 - 2021 న విడుదల చేసింది. నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. మహాత్మాగాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిప్ఫీన్స్ దేశాలు కూడా ఆమోదించాయి. నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాద...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.