తెలుగు వారికి ఒక విశిష్టత, గుర్తింపు కల్పించిన మహా నటుడు, మహానేత మన NTR . NTR గౌరవార్దం 28-05- 2000 న మన తపాల శాఖా వారు మూడు రూపాయల విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ రూపకల్పన పరమాద్బుతం. ఈ తపాల బిళ్ళ పై నందమూరి తారాక రామారావు గారి చిత్రం తో పాటు వారి కీర్తి శిఖరం కు చిహ్నం గా హిమాలయ పర్వతాలు, చలన చిత్ర రంగానికి ప్రతినిధిగా సినిమా రీలు, దానిలో వారి ప్రజా/ కళా సేవకు గుర్తుగా భూమి,సూర్యుడు ఉన్నాయి. N.T.RAMA RAO India Post released one Commemorative postage stamp to Dr. N.T.Ramarao on 28-05-2000 BROCHURE- NTR తపాలాబిళ్ళ తో పాటు విడుదల చేసిన ప్రత్యక తపాలా కవరుపై ( FIRST DAY COVER ) ప్రజలతో ప్రసంగించుతున్న N.T.రామారావు గారి చిత్రం ముద్రించారు . ఈ ప్రత్యేక కవర్ పై ప్రత్యేక తపాలా ముద్ర గా ' శ్రీ కృష్ణ దేవరాయలు వేషం లో ఉన్న రామారావు ' చిత్రం తో రూపొందించటం మరొక ప్రత్యేకతను సంతరించుకుంది. FIRST DAY COVER -NTR నందమూరి తారక రామారావు (1923-1996) విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు, తెలుగు జాతి కీర్తి పతాక
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.