Skip to main content

Posts

Showing posts from March, 2016

మన తెలుగు వారి లో జాతీయ ప్రాముఖ్యం గల వారు ఎవరు లేరా?

India Post Issued new 11th series of  Definitive Stamps in the name of    Builders of Modern India మన తపాల శాఖ లో రోజు వారి వాడకం కొరకు  నవభారత నిర్మాతల వరసలో  15-10-2015 నుండి కొత్త  5 రూపాయల  తపాల బిళ్ళలు వాడకం లోకి వచ్చాయి.  భగత్ సింగ్ , స్వామి వివేకానంద, దీనదయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ. బాబు రాజేంద్ర ప్రసాద్ , మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రామ్ మనోహర్ లోహియా    లాల్ బహుదూర్ శాస్త్రి ల బొమ్మలతో వీటిని విడుదల చేసారు.   ఇదే వరసలో వచ్చిన తపాల బిళ్ళల లో 25 పైసల నెహ్రు తపాల బిళ్ళ స్థానం లో మహాత్మా గాంధీ , యోగ లను , 50 పైసల పై సుబ్రమణ్య భారతి ,రూపాయ తో తిలక్ , 50/- రూపాయల విలువతో రవీంద్రనాథ్ టాగోర్  విడుదుల చేసారు. ఈ వరసలో మొత్తం 27 రకాల తపాల బిళ్ళలు  విడుదల చేసారు.  దక్షిణాది రాష్ట్రాలలో కేవలం    తమిళ ప్రముఖులకుమాత్రమే దీనిలో స్థానం కల్పించారు. దక్షినాది నుండి ఎన్నిక చేసిన  నలుగురు ( సుభ్రమణ్య భారతి , సుబ్బులక్ష్మి, రామానుజం, తిరువల్లార్) తమిళులే....