భారతదేశపు ఆరోవ రాష్ట్రపతిగా 1977-1983 వరకు పనిచేసిన శ్రీ నీలం సంజీవ రెడ్డి(1913-1996) గారి శత జయంతి ని గుర్తించని కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో మన తెలుగు వారిని మరో సారి కించపరిచింది. రాష్ట్రపతి గా ఏకగ్రీవంగా ఎన్నికై రెండు సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసి రెండు పర్యాయాలు లోకసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి శ్రీ నీలం సంజీవరెడ్డి. వారి శత జయంతి ని మన రాజధాని ఢిల్లీ లో తలుచుకున్న నాధుడే లేడు. మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది. 1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు. ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిర...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.