తపాల బిళ్ళ పై సాదారణంగా జాతీయ నాయకులు, ప్రసిద్ది పొందిన కవులు,కళాకారులు, క్రీడాకారులు బొమ్మలు మాత్రమే ఉంటాయి . అయితే కొద్దిగా మార్పు తో సామాన్యులు సైతం తమ బొమ్మను (బ్రతికి ఉన్నప్పుడే) తపాలా బిళ్ళ పై చూచుకునే అవకాశం వచ్చింది. తపాలా బిళ్ళల సేకరణ పై అభిరుచి పెంచటానికి మన తపాలా శాఖ 'My Stamp' పేరుతో తొలిసారి 2011 లో డిల్లీ లో జరిగిన అంతర జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శన లో వ్యకిగత తపాలా బిళ్ళలు విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా భారత తపాలా శాఖ 23-8-2013 నుండి విజయవాడ లో కొత్తగా ' మై స్టాంప్ ' (నా తపాలాబిళ్ళ) పేరుతో వ్యక్తుల అభీష్టం మేరకు వారు కోరుకున్న చిత్రం తో తపాలా బిళ్ళలు విడుదల చేయాటానికి శ్రీకారం చుట్టింది. తమ బొమ్మతో 5 రూపాయల విలువగల 12 తపాలా బిళ్ళల గల ఈ మై స్టాంప్ షీట్ ను 300 రూపాయలకు విజయవాడ ప్రధాన తపాలా కార్యాలయం లో పొందవచ్చు. 17 రకాల తపాలా బిళ్ళల కాంబినేషన్ తో ఈ 'మై స్టాంప్' షీట్స్ లబిస్తాయి. ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం మరియు పోటో తీసుకొని వెళ్లి ఈ తపాలా బిళ్ళను పొందవచ్చు. మై స్టాంప్ నమూనా చిత్రం
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.