గోరా ( 1902-1975) గోరా గా ప్రసిద్ధి చెందిన భారతీయ నాస్తికవాద నే త. వీరి పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు . 15 నవంబర్, 1902 న ఒరిస్సా లోని ఛత్రపురం లో పుట్టి, విజయవాడను కేంద్రంగా చేసుకొని అనేక సామాజక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ముడనమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేసిన నాస్తిక హేతువాది, సంఘ సంస్కర్త, గాంధేయ వాది. గోరా ఆచరణ వాది . గ్రహణాల సందర్భంలో గర్భిణి గా వున్న తన భార్యను మూడు సార్లు ఆరు బయట త్రిప్పి ఏ విధమైన మొర్రిలు ఏర్పడవని ప్రజలకు తెలిసే విధంగా ఆచరించి చూపారు. తన పిల్లల పేర్లు సైతం ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో పుట్టిన అబ్బాయికి లవణం అని, భారతీయులు చట్ట సభల్లో గెలిచిన సందర్భంలో పుట్టిన అబ్బాయికి విజయం, రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో పుట్టిన అబ్బాయికి సమరం, గాంధి ఇర్విన్ ఒడంబడిక సందర్భంలో పుట్టిన అమ్మాయికి మైత్రి అని, తొమ్మిదవ సంతానం కు పేరు నౌ, అని పెట్టి సముచిత నామములు పెట్టే విధానానికి ఆద్యుడయ్యాడు. 1975 జులై 26న గోరా మరణించినప్పుడు వారి అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు. 2002, ఆగష్టు 12 న ...