Skip to main content

Posts

పద్మ విభూషణ అక్కినేని నాగేశ్వరరావు - MY Stamp IIFF

commemorative stamps honouring  Raj Kapoor, Mohammed Rafi, Akkineni Nageswara Rao, and  Tapan Sinha  for their significant contributions to Indian cinema at the 55th International Film Festival of India in Goa on November 20, 2024 గోవా లో జరిగిన ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IIFF) లో మన భారతీయ సినీ ప్రముఖుల శత జయంతులు జరుగుతున్న వేళ వారి  గౌరవార్థం ఒక ప్రత్యేక మై స్టాంప్ ను నవంబరు 20, 2024న విడుదల చేసారు. దీనిలో    ప్రముఖ  హిందీ చలన చిత్ర నటులు రాజ్ కపూర్. గాయకుడు మహ్మద్ రఫీ, తెలుగు వెండి తెర వెలుగు  అక్కినేని నాగేశ్వరరావు, కథా రచయిత తపన్ సిన్హా లకు చోటు కల్పించారు.  
Recent posts

పద్మ విభూషణ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి

ప్రఖ్యాత తత్వవేత్త రచయిత విద్యావేత్త మరియు పద్మ విభూషణ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 25-09-2024న ఒక ప్రత్యేక తపాలా కవరు (తపాలా చంద్రిక) ను విడుదల చేసారు. ఇది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఉన్న ' Prof Kotha Sachidanada Murty centre for Studiesbin Afro- Asian Philosophies' వారి సౌజన్యంతో విడుదల చేసారు.  Special cover on Dr. Kotha Sachidanada Morty కొత్త సచ్చిదానందమూర్తి (1924 సెప్టెంబరు 25 - 2011 జనవరి 25) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు.

పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు

పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు- ANR  తపాలా బిళ్ళపై  అక్కినేని  మన భారత తపాలా శాఖ వారు 19-09-2024న పద్మ విభూషణ్ మరియు దాదాసాయెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళపై ముద్రించిన అక్కినేని ఛాయా చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు, సినిమా దర్శకుడు బాపు గారు రూపొందించారు. ఇది అక్కినేని ఇష్టమైన చిత్రం. First Day Cover - Dr. Akkineni Nageswararao తెలుగు ప్రఖ్యాత తెలుగు  చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారు. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొ...

ప్రముఖ పారిశ్రామిక వేత్త , విద్యావేత్త ఆచార్య పి. ఆర్. రామకృష్ణ

ప్రముఖ పారిశ్రామిక వేత్త , విద్యావేత్త ఆచార్య పి. ఆర్. రామకృష్ణ శత జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవరు 29-03-2018 న కోయంబత్తూరు లో విడుదల చేసారు.  A special cover on Prof. P.R. Ramakrishnan A special cover on Prof. P.R. Ramakrishnan was issued by India Post on 29th March, 2018 on his Birth centenary celebrations. Prof. P R RAMAKRISHNAN , Son of Shri V. Rangaswamy Naidu; born in Peelamedu, Coimbatore on October 11, 1917; educated at Madras University. A post-graduate in electrical engineering from the Massachusetts Institute of Technology (USA) Mr. Ramakrishnan had worked in the General Electric Company in the U.S. for seven years. P. R. Ramakrishnan was the first Indian Alumni of MIT Sloan School of Management and a graduate of Massachusetts Institute of Technology, United States who founded Madras Aluminum Company, South India Viscose, Coimbatore Institute of Technology and many other textile industries and two time Member of Parliament representing Indian National Congress fr...

జే. ఈశ్వరీబాయి - My Stamp and Special cover

భారత తపాల శాఖ 23 -02- 2021 న రిపబ్లిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ దళిత నాయకురాలు  శ్రీమతి  జే. ఈశ్వరీబాయిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ మరియు వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది .  Special cover on Dalit Icon J. Easheari Bai My Stamp - J. Eashwaribai My Stamp sheetlet  on Dalit Icon J. Eashwaribai

ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ - My Stamp

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సమాజ సేవాతత్పరుడు, దానశీలి, ఆంధ్ర బిర్లా గా ప్రసిద్ధి పొందిన ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ గారిచే మన తెలుగునాట అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిలో ఆంధ్రా షుగర్స్ ఒకటి.   My Stamp : Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad 1947 ఆగస్టు 11న తణుకు పట్టణం లో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  దానికి బీజం వేసి అభివృద్ధి చేసిన మూల పురుషులు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అయితే దాని తొలి మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల శ్రీ రామచంద్ర వెంకట కృష్ణ రంగారావు గారు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖా  11 ఆగస్టు 2022న  ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళ (మై స్టాంప్ ) విడుదల చేసారు.  Foundars of Andhra Sugars LTD  Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad ANDHRA SUGARS LTD.  - COMPANY HISTORY Andhra Sugarsincorporated in 1947 is engaged in the manufacture and sale of sugarOrganic and Inorganic Chemcials.Edible & Non-Edible Vegetable Oils and Non-Conventional Power Generation at ...

ఆజాదికా అమృత మహోత్సవమ్ - Amritpex - 2023

మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవమ్ లో భాగంగా  మన దేశ రాజధాని దిల్లీ లో 11 - 02 - 23 నుండి 15-02-23 వరకు దేశ స్థాయిలో అమృతఫెక్స్ - 2023 పేరుతొ తపాలా బిళ్ళల ప్రదర్శన మరియు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మూడు విడతలు గా 22 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. వీటితో పాటు 14 ప్రత్యేక తపాలా కవర్లు కూడా విడుదల చేసారు.   ఆజాదికా అమృత మహోత్సవము  లోగో తో నేతాజీ, బాపు, భగత్ సింగ్  లతో  ఒక జంట తపాలా బిళ్ళను ( Se - Tenant  Stamp )   ముందుగా విడుదల చేసారు  Se - Tenant  Stamp : Azadika Amrit Mahotsav -2023 Issued on 11 Feb 23 Bridal Costumes of India - 1 Issued on 12 Feb 23 Bridal Costumes of India - 2 Issued on 12 Feb 23 మన భారతీయ సాంప్రదాయపు పెళ్లి కూతురు వస్త్రధారణలపై  ఎనిమిది తపాలా బిళ్ళలు , రెండు మినియేచర్లు విడుదల చేసారు.  వీటిలో తమిళనాడు, జమ్మూ కాశ్మీరు, పంజాబీ, గుజరాతీ అమ్మాయిలు ఒక మినియేచరులోనూ పశ్చమ బెంగాలు, మణిపురి, మహారాష్ట్ర, కేరళ పెళ్లి కూతుర్లు మరొక మినియేచరులోనూ ముద్రించారు....