Skip to main content

Posts

Showing posts from August, 2015

తపాల బిళ్ళ పై సామ్రాట్ అశోకుడు

India Post released a commemorative stamp on Samrat Ashok on 24 August 2015 మన తపాల శాఖ 24-08-2015 న  సామ్రాట్ అశోకుడు పై ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  అశోకుడు క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. మన జాతీయ చిహ్నం సారానాద్ లోని అశోక స్తంబం నుండి స్వీకరించబదినది. అలాగే మన జాతీయ జండాలో అశోకుని ధర్మచక్రం ఉంచబడినది.   

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా ప్రత్యేక తపాల కవర్లు

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా   మన తపాల శాఖ  13-07 2015 న రాజమండ్రి లో గోదావరి నదిపై ఉన్న ప్రసిద్ది చెందిన హవేలోక్ ఆర్చ్ వంతెన పై ఒకటి , గోదావరి సాగర సంగమ ప్రాంతం అయిన అంతర్వేది పై ఒకటి , 15-07-2015 న  రాజమండ్రి కోటిలింగాలు వద్ద ఉన్న అతి పొడవైన స్తానవాటిక పై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.   అలాగే తెలంగాణ లో 14-07-2015 న గోదావరి నది తెలుగు నేల పై అడుగు పెట్టిన ప్రదేశం ' కందకుర్తి ' పై ఒకటి ( ఈ గ్రామం గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణీ సంగమ స్థలంలో ఉన్న తీర్థక్షేత్రం) ,కాళేశ్వర స్వామి దేవాలయం పై ఒకటి , పోచంపాడు లో గోదావరిపై కట్టిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ పై మరొకటి  రెండు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. On the occasion of Godavari Puskaralu 2015 Four special covers were released on 13th, 14th,15th July 2015.  With respect to Telangana state One special cover was released on  Kandakurthi-Triveni Sangamam and second was on  Sriram Sagar Irrigation Project, Pochampadu . With respect to Andhra Pradesh one special cover on Godavari HAVELOCK - ARCH BRIDG

రణరంగ చౌక్ - తెనాలి

A Special cover Issued by Indian Post on 1-11-2007 in APPEX -2007, held at  Vishakhapatnam. This Special cover depicts -  Ranarang chouk -Tenali ,Guntur dist. విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ( APPEX -2007 ) 1-11-2007న  ఒక  ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసారు.  దానిపై   తెనాలి లో ఉన్న స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు. దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మహాత్మా గాంధీ బొమ్మను ఉపయోగించారు Special cover on  Ranarang chouk -Tenali మన దేశ స్వతంత్ర పోరాటం లో భాగం గా 1942 లో ఆగష్టు 9న జరిగిన ముంబాయి  కాంగ్రెస్ సమావేశంలో  సంపూర్ణ స్వరాజ్యాఉద్యమానికి నాంది పలుకుతూ   " క్విట్ ఇండియా " తీర్మానాన్ని ఆమోదించారు.  ఈ సభకు గుంటూరు జిల్లా నుండి   ప్రముఖ స్వతంత్రయోధుడు గాన్దేయవాది  శ్రీ కల్లూరి చంద్రమౌళి  గారి నాయకత్వంలో వెలవొలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు,అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి చౌదరి పాల్గొని వచ్చారు.   వీరి రాకతో ఆంద్ర లో క్విట్ ఇండియా ఉద్యమం చాలా    ఉదృతంగా జరిగింది  ఈ ఉద్యమం తెనాలిలో అదుపుత