Skip to main content

Posts

Showing posts from February, 2015

శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం

                                      శ్రీశైలం -  మల్లిఖార్జున స్వామి దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రఖుమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి  శ్రీశైలం లో ఉన్న భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం.  ఈ ఆలయం పై మన భారత తపాల శాఖ   15  - 5  - 2003  న  ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది. మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ   దేవాలయము  అభేద్యమైన ప్రాకారము కలిగి  లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది.  ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా  చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది. Mallikarjuna   swami   temple   - SRISAILAM - FDC  శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం ఫై ఇంతకు ముందు మన తపాల శాఖ ఆ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి  ప్రత్యేక పోస్టల్ ముద్ర ను కేటాయించి 7-3-1978 న ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది.  ప్రత్యేక పోస్టల్ ముద్రగా ( Pictorial  post mark ) ఆలయ రాజ గోపురం ను కవరు పై   భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను ముద్రించారు. Pictorial  post mark  - Srisailam Pictorial Cancellatio

దామోదరం సంజీవయ్య

On14 th  February 2008 India Post Issued a  commemorative postage stamp on DAMODARAM   SANJEEVAIA H (1921-1972) DAMODARAM   SANJEEVAIA H- FIRST DAY COVER దామోదరం సంజీవయ్య  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య   1921   ఫిబ్రవరి14న కర్నూలు  జిల్లా,    కల్లూరు  మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న  పెద్దపాడు  లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు.  తొలి దళిత ముఖ్యమంత్రి గా పని చేసిన వీరు  రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. 7-5-1972 న వీరు మరణిచారు.  మన తపాల శాఖ 14-2-2008 న దామోదరం సంజీవయ్య స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది. దీనిపై ఆంద్రప్రదేశ్ ను ప్రతిబంబిచేలా చార్మినార్, తిరుమల దేవాలయం , నాగార్జున సాగర్ ఆనకట్ట , కూచిపూడి నృత్యం  ఈ తపాల బిళ్ళ పై చూడవచ్చు. ప్రధమ దిన కవరు పై ఆంధ్