Skip to main content

Posts

Showing posts from October, 2010

Postage Stamps of HYDERABAD STATE

హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో విలీనం కాక ముందు నిజాముల పాలనలో వాడిన తపాలా బిళ్ళలు  Postage Stamps of    HYDERABAD STATE   (  princely state in India ruled by the Nizams from 1724 to 1948 ) India had  many Princely  states, but not all issued postal stamps  One of the Princily state Hyderabad State Issued stamps were shown below. The date of the starting year is 1869 and ending in the year 1949. One of the earliest postage stamps of Hyderabad state, the half-anna 1871  1 Anna - Charminar 4 Pies - Unani General Hospital (1937) 1Anna - Osmania University (1937) 1Anna,4 Ps -Power House Of Hyderabad (1947) 1 Anna - Town Hall, Hyderabad 6 Anna - Golkunda Fort  3 Anna - Kakatyai Arch -Warangal Fort

మహానటి కన్నాంబ

Special Cover  by Indian Post on Pioneers of Indian Film Industry --Smt. P.Kannamba (1912-1964) Date of Issue : 21- 7 -2005 ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు. మహానటి కన్నాంబ  ద్రౌపదీ వస్త్రాపహరణం, 

కడప జిల్లా కవిలి కోడి

Special Cover on Conserve Nature and Environment by India Post in CUDDAPEX - 2005  Date of Issue : 01-10-2005 కడప జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో ( CUDDAPEX - 2005 ) తపాల శాఖ ఒక ప్రత్యక కవరును  విడుదల చేసింది. దీనిపై నల్ల మల అడవిలో విరిగా కన్పించే ఎర్ర చందనం చెట్లను చూపే చిత్రాన్ని ముద్రించారు.  జేర్దోన్స్   కోర్సెర్( Jerdon ' S  Courser )   అనే   కలివి   కోడి బొమ్మతోతయారుచేసిన ప్రత్యేక పోస్టల్ ముద్రను క్యాన్సిలెషన్ కొరకు వాడటం జరిగింది.  Jerdon ' S  Courser మన   రాష్ట్రంలో   తూర్పు   కనుమలలో   మాత్రమే  జీవించుతూ   త్వరలో   అంతరించి   పోతున్న   జాతి   చెందిన   పక్షి .  కడప , అనంతపూరుజిల్లాలలోఉన్ననల్లమల  అడవి   ప్రాంతం లో మాత్రమే   అరుదుగా కనిపించే   ఈ   పక్షి ని   1986   లో   శాత్రవేత్తలు   చూడటం   తటస్త   పడినది .  ఒక అంచనా   ప్రకారం   ఈ  పక్షులు   ఇప్పుడు   కేవలం   పదుల   సంఖ్యల   లోనే ఉన్నాయి .  ఈ   అరుదైన   పక్షులను   కాపాడాలన్న   ఉద్దేశంతో   తపాల   శాఖా ఇంతకు ముందు    ఒక తపాల   బిళ్ళను  07-10-1988 న  విడుదల   చేసింది .

Waterfalls- ఎత్తిపోతల జలపాతం

Special cover Issued by Indian Post on   ETHIPOTHALA Waterfalls, A.P. at NALPEX-2007  Date of Issue :14-03-2007  నల్గొండ జిల్లా తపాల బిల్లల ప్రదర్శన( NALPEX-2007 ) సందర్బంగా  నాగార్జన సాగర్ కు సమీపం లో ఉన్న ఎత్తిపోతల జలపాతం పై ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. ఈ  ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగుల నుండి ఎత్తు నుండి పడి ఉత్తరదిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన కృష్ణానదిలో కలుస్తున్నది.   ఇక్కడ  మొసళ్ళ  పెంపక కేంద్రం ఉంది.

రాజ సంస్థానాలు విడుదల చేసిన తపాల బిళ్ళలు

INDIPEX -2011, Indian Postage Stamps on Princely States Date of Issue – 6 October 2010 PRINCELY STATE - INDORE PRINCELY STATE - BAMRA PRINCELY STATE - COCHIN PRINCELY STATE - SIRMOOR   2011,  ఫిబ్రవరి 12 నుండి 18 వరకు మన దేశ రాజధానిలో జరిగే ప్రపంచ తపాల బిల్లల ప్రదర్శనకు  (INDPEX-2011)  ముందస్తు సన్నాహం గా మన దేశం లో చారిత్రిక ప్రసిద్ది పొందిన     మన భారతీయ రాజ సంస్థానాలు విడుదల చేసిన తపాల బిళ్ళలు,   అవి అన్ని ఉండేలా     మినిఏచర్  ను  విడుదల చేసారు. వీటిపై ఇండోర్, సిర్మూర్ , బమర, కొచిన్ రాజ  సంస్థానాలు  జారీచేసిన తపాల బిళ్ళను  ముద్రించారు. 

XIX Commonwealth Games,Delhi-2010

India Post issued  a Miniature Sheet with   A set of four stamps were released to mark the Opening of XIX CWG 2010 Games at Delhi. The stamps were on Archery , Athletics , Hockey and   Badminton .  For the First time the  Denomination printed on stamp is in new Rupee Design. Miniature Sheet ,  Date Of Issue:-03.10.2010. Badminton and  Hockey   Athletics and  Archery  అట్టహాసంగా మొదలైన 19 వ కామన్ వెల్త్ క్రీడల ప్రారంభం సందర్భంగా తపాల శాఖ వారు నాలుగు తపాల బిళ్ళలను ,వాటిపాటు ఒక మినీ ఎచార్ ను విడుదల చేసారు.వీటిపై బాడ్మింటన్,హాకి,అదేలేటిక్సు,అర్చరిలకు సంబందించిన ఛాయా చిత్రాలు ముద్రించారు. మన రూపాయికి క్రొత్తగా  రూపొందించిన సింబల్ను మొదటి సారిగా ఈ తపాల బిల్లలపై ఉపయోగించారు.